Homeఎంటర్టైన్మెంట్Nayanthara: జన్మలో ఆ ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేయనని చెప్పిన నయనతార... కారణమేంటంటే..?

Nayanthara: జన్మలో ఆ ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేయనని చెప్పిన నయనతార… కారణమేంటంటే..?

Nayanthara: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ కాలం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక సినిమాతో సక్సెస్ సాధిస్తే సరిపోదు. ఎప్పటికీ వాళ్ల నుంచి వచ్చే సినిమాలన్నీ సక్సెస్ గా నిలవాల్సిందే. అందులో ఏమాత్రం తేడా కొట్టిన కూడా వాళ్లని ఐరన్ లెగ్ గా ముద్ర వేసి సినిమా ఇండస్ట్రీ నుంచి పక్కన పెట్టేస్తారు. ఇక దానికి తోడుగా హీరోయిన్ల విషయంలో రోజుకొక కొత్త హీరోయిన్ వచ్చి వాళ్ళ స్కిన్ షో తో ప్రేక్షకులను అలరిస్తూ […]

Nayanthara: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ కాలం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక సినిమాతో సక్సెస్ సాధిస్తే సరిపోదు. ఎప్పటికీ వాళ్ల నుంచి వచ్చే సినిమాలన్నీ సక్సెస్ గా నిలవాల్సిందే. అందులో ఏమాత్రం తేడా కొట్టిన కూడా వాళ్లని ఐరన్ లెగ్ గా ముద్ర వేసి సినిమా ఇండస్ట్రీ నుంచి పక్కన పెట్టేస్తారు. ఇక దానికి తోడుగా హీరోయిన్ల విషయంలో రోజుకొక కొత్త హీరోయిన్ వచ్చి వాళ్ళ స్కిన్ షో తో ప్రేక్షకులను అలరిస్తూ దర్శకనిర్మాతల దృష్టిలో పడుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే నయనతార లాంటి నటిమని దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతుందంటే మామూలు విషయం కాదు. రీసెంట్ గా చిరంజీవి హీరోగా వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో కూడా తను హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక ఇలాంటి క్రమంలోనే నయనతార విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన విషయం మనకు తెలిసిందే.

Also Read: రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతే ఆరోగ్యకరం? తక్కువైనా.. ఎక్కువైనా.. ఎలాంటి సమస్యలు?

ఇక ఆమె సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో నటించడానికి సిద్ధంగా ఉంది. కానీ ఒక ఇద్దరు స్టార్ హీరోయిన్లతో మాత్రం నటించబోనని తను ఓపెన్ గా చెప్పేసింది. ఇంతకీ ఆ స్టార్ హీరోలు ఎవరు అంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగుతున్న శింబు కావడం విశేషం…

కెరియర్ మొదట్లో శింబుతో ‘వల్లభ’ అనే సినిమా చేసిన నయనతార అతనితో ప్రేమ వ్యవహారాలను నడిపింది. దాంతో ఆయన తనను ప్రేమ పేరు చెప్పి మోసం చేశారంటూ ఆయన నుంచి దూరమైంది. ఆ తర్వాత హీరో కొరియోగ్రాఫర్ అయిన ప్రభుదేవా తో ప్రేమ వ్యవహారాలను మరికొద్ది రోజులు నడిపింది.

అయితే ప్రభుదేవా అప్పట్లో కొరియోగ్రఫీ చేస్తూనే కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. తనకు హీరోగా కూడా మంచి గుర్తింపైతే ఉంది. మరి ఇలాంటి క్రమంలోనే తన నుంచి సైతం విభేదాలు రావడంతో ఆయన నుంచి విడిపోయి కెరియర్ మీద ఫోకస్ పెట్టింది. ఇక అప్పటినుంచి ఆ ఇద్దరు హీరోలతో ఈ జన్మలో నటించబోనని ఓపెన్ గా చెప్పేస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper