spot_img
Homeఆధ్యాత్మికంToday 10 February 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకొని అదృష్టం..

Today 10 February 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకొని అదృష్టం..

Today 10 February 2026 Horoscope: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ఇందులో భాగంగా మంగళవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు ఈరోజు ఏ పని చేపట్టిన అనుకూలంగా ఉంటుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కష్టపడిన దానికి తగిన ఫలితం ఉంటుంది. వ్యాపారం ఎక్కువగా లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు పదోన్నతి ఉండే అవకాశం ఉంది. వ్యాపారులకు కుటుంబ సభ్యులు మద్దతు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. దీంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆర్థికంగా మాత్రం మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఏ పని చేపట్టిన తనని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉండడంతో సకాలంలో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. స్నేహితుల నుంచి ధన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతోషంగా ఉండగలుగుతారు. జీవిత భాగస్వామి కోసం ప్రత్యేకంగా వస్తువులు కొనుగోలు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకూడదు. జీవిత భాగస్వామి కోసం ప్రత్యేకంగా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు అన్ని రంగాల్లో రాణించే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడంతో సంతోషంగా ఉండగలుగుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు పదోన్నతి గురించి ఆలోచిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. విద్యార్థులు పోటీపరీక్షలో పాల్గొనడానికి తల్లిదండ్రులను సపోర్ట్ ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనే ముందు గురువుల సలహా తీసుకోవడం మంచిది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు అన్ని పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు రానున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పోటీ పరీక్షలో పాల్గొనడానికి విద్యార్థులు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విదేశాల్లో ఉండే వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు చేపట్టిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపారవేత్తలకు లాభాలు ఉంటాయి. పిల్లలతో సరదాగా గడుపుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper
Exit mobile version