Homeఆధ్యాత్మికంToday 2 June 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు అనుకున్న ప్రతి...

Today 2 June 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు అనుకున్న ప్రతి పని విజయమే అవుతుంది..

Today 2 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశరాసులపై మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు కెరీర్ విషయంలో పురోగతి లభిస్తుంది. మరికొన్ని రాశుల వారు కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా గడుపుతారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు ఆధ్యాత్మిక వాతావరణం పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్నేహితుల సహకారంతో అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. గ్రహాల అనుకూలత ఉండటంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతోషంగా గడుపుతారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు అపారమైన ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సమయంలో డబ్బులు పొదుపు చేయడం అలవర్చుకోవాలి. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మాటలను పొదుపు చేసుకోవాలి. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండటమే మంచిది. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కొన్ని సమస్యలు తొలగిపోవడంతో మానసికంగా సంతృప్తిగా ఉంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పెండింగ్ పనులను పూర్తి చేయడంతో సమస్యలు తొలగిపోతాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు వస్తాయి. దీంతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థుల కోటి పరీక్షలో పాల్గొంటే సులభంగా విజయం సాధించగలుగుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే ఒక పనిని పూర్తి చేయడానికి ప్రణాళికా ప్రకారంగా ముందుకు వెళ్లాలి. కొందరు తప్పుడు దారులని చూపిస్తారు. ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల సలహాలను పాటించాలి. ఇంట్లో విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త వాహనాల కొనుగోలు కలిసి వస్తుంది. ఏదైనా పనిని ప్రారంభిస్తే దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంట్లో అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు. దూరపు బందులను కలవడంతో సంతోషంగా గడుపుతారు. కొత్త వస్తువుల కొనుగోలు పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. గతంలో కంటే స్నేహితుల సంఖ్య పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు రావచ్చు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. గతంలో కంటే ఇప్పుడు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంతో వ్యాపారులకు కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో నాణ్యమైన ఆహారాన్ని తీసుకుని ప్రయత్నం చేయాలి. ఆర్థిక పరిస్థితిపై తల్లిదండ్రుల సూచనలను పాటించాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రులతో కలిసిమెలిసి ఉంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు చేసే పనిలో విజయం సాధిస్తారు. ప్రయాణాలు చేయాల్సివస్తే కలిసి వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణిస్తారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని సానుకూలమైన ఫలితాలే ఉంటాయి. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి. గతంలో కంటే ఇప్పుడు ఆలోచన విధానం మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తులు కలవడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలు పాల్గొంటే రాణిస్తారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దూర ప్రయాణాలు ఫలితాలను ఇస్తాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version