Today 1 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అదనపు ఆదాయం చేకూరే అవకాశం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు చేసే ప్రయత్నాలు అన్నింటిలో విజయం సాధిస్తారు. గతంలో ఆగిపోయిన పనులు ఈరోజు పూర్తి అవుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండటంతో ఈరోజు అధికంగా లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు ఆగిపోయిన బకాయిలు తిరిగి వస్తాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు ఉంటాయి. కొత్తగా పెట్టుబడును పెట్టడానికి ఇదే మంచి సమయం. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. చాలాకాలంగా అనుకుంటున్న కోరికల్లో అది ఈరోజు నెరవేరుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అదనపు ఆదాయం పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఈరోజు కొన్ని శుభవార్తలు వినాల్సి వస్తుంది. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు కోపాన్ని నియంత్రించుకోవాలి. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడును పెట్టడానికి ఇదే మంచి సమయం. స్నేహితుల నుంచి ధన సహాయం పొందుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు అన్ని విషయాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉండడంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగా విషయాలు ఏర్పడతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విద్యార్థుల భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం ఉండడంతో ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొందరు మంచిగా ఉన్నట్లే ఉండి మోసం చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. కొంత సమాచారం మేరకు నిరాశ చెందుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు గతంలో కంటే మెరుగైన లాభాలు పొందుతారు. ఖర్చులు పెరగడంతో ఆందోళన వాతావరణం ఉంటుంది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడులు పెడతారు. అదనపు బాధ్యతలు పెరగడంతో తీరికలేకుండా గడుపుతారు. పాత అప్పులను క్లియర్ చేయడానికి అనువైన మార్గం దొరుకుతుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల అండదండలు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఊహించిన మేరకు లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడును పెట్టే వారికి ఇదే మంచి సమయం. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పాత బకాయిలను చెల్లిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో కలిసి సరదాగా ఉంటారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆగిపోయిన డబ్బు తిరిగి వసూలు అవుతుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం ధరనీయంగా పెరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు సాధిస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. నిరుద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.