https://oktelugu.com/

Spirituality: ఆధ్యాత్మికత మార్గం వైపు మనస్సును మళ్లించాలంటే.. ఇలా చేయండి

మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి విషయాలకి కూడా కోపం అవ్వరు. ప్రతి విషయాన్ని చాలా సున్నితంగా, ఒత్తిడికి గురవకుండా మీకు మీరే పరిష్కరించుకోగలరు. మరి ఆధ్యాత్మికత మార్గం వైపు వెళ్లాలంటే కొన్ని నియమాలు పాటించాలి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 17, 2024 / 02:47 PM IST

    To divert the mind towards the path of spirituality

    Follow us on

    Spirituality: ఆధ్యాత్మికం అంటే భక్తి అని అందరికీ తెలిసిందే. అయితే చాలా మందికి దేవుడు, భక్తిపై నమ్మకం ఉండదు. కొందరికి దేవుడు మీద భక్తి, నమ్మకం లేకపోయినా కూడా ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్తుంటారు. కానీ వెళ్లాడానికి మనసు ఒప్పుకోదు. ఆధ్యాత్మికంలో వెళ్లాలి అంటే చాలా మంది దేవుడికి పూజ మాత్రమే చేయాలని అనుకుంటారు. కానీ ఆధ్యాత్మికం అంటే చాలా మార్గాలు ఉన్నాయి. వీటిలో వెళ్లడం వల్ల జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి విషయాలకి కూడా కోపం అవ్వరు. ప్రతి విషయాన్ని చాలా సున్నితంగా, ఒత్తిడికి గురవకుండా మీకు మీరే పరిష్కరించుకోగలరు. మరి ఆధ్యాత్మికత మార్గం వైపు వెళ్లాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో మరి తెలుసుకుందాం.

    కొందరు ఎంత ప్రయత్నించిన ఆధ్యాత్మికత మార్గం వైపు వెళ్లలేరు. అలాంటి వాళ్లు రోజు ఉదయాన్నే లేచి యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. అది కూడా సూర్యకాంతిలో చేయడం వల్ల మనస్సు ఆహ్లాదకంగా ఉంటుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండటం వల్ల అటు వైపు మనస్సు మళ్లే అవకాశం ఉంటుంది. మనస్సు ఆధ్యాత్మికంపై మళ్లినప్పుడు ప్రతి సమస్య కూడా చిన్నగా కనిపిస్తుంది. ఇలా మనస్సు అటు సైడ్ వెళ్లాలంటే జీవితంలో ఏం ఆశించకుండా ఉండాలి. గతంలో జరిగిన విషయాలు, భవిష్యత్తులో ఏం జరుగుతుందని భయపడకుండా ఉండాలి. ప్రస్తుతం ఏం జరుగుతుందో దాని కోసం మాత్రమే ఆలోచించాలి. రోజంతా ఎంత బిజీగా ఉన్న కూడా కొంత సమయం కళ్లు మూసుకుని ఆలోచించాలి. అలా చేయడం వల్ల మీకు మనస్సు మారే అవకాశం ఉంటుంది. అందరి మీద కోపం కాకుండా ప్రేమతో ఉండండి. ఆధ్యాత్మికతలో కోపానికి అసలు చోటు ఉండదు. ప్రతి విషయాన్ని ప్రేమ కోణంలో మాత్రమే చూడాలి. ఎంత కోపం వచ్చే సంఘటన అయిన కూడా కూల్ గా మాత్రమే స్పందించాలి.

    ప్రతి మనిషికి ప్రేమ, దయగుణం ఉండాలి. అసలు అహంకార భావం ఉండకూడదు. ఇలాంటి అన్నిటిని దూరం పెడితే మీకు తెలియకుండా మీరే ఆధ్యాత్మికత మార్గం వైపు వెళ్తారు. దేవుడి మీద భక్తి, నమ్మకం లేకపోయిన ఆధ్యాత్మికతం వైపు వెళ్లవచ్చు. ఒంటరిగా కూర్చుని మీ లైఫ్ గురించి ఆలోచించండి. ఏం చేయాలి? చేయకూడదు? అప్పుడు మీకు తప్పులు తెలియడంతో పాటు మీరేంటో కూడా తెలుస్తుంది.ఆధ్యాత్మికతం జీవితంలో ఎన్నో విషయాలను ఆధ్యాత్మికతం నేర్పుతుంది. కొందరు ఇతరుల మీద ఆధారపడతారు. కానీ ఇలా కాకుండా మీకు అంటూ ఒక ఆలోచన ఉండేలా చేస్తుంది. మీ నిర్ణయాలు మీరు తీసుకోవడం వల్ల జీవితం మీద ఒక క్లారిటీ వచ్చేలా ఆధ్యాత్మికతం చేస్తుంది. భక్తి ఉన్న వాళ్లకి మాత్రమే ఈ ఆధ్యాత్మికత మార్గంలో వెళ్లాలని అనుకోవద్దు. భక్తి లేకపోయిన ఇందులోకి వెళ్లడం వల్ల జీవితంలో ఎన్నో మార్పులను చూస్తారు.