Kiwifruit: ఆరోగ్యానికి అన్ని పండ్లు మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. పండ్లు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు.. అందంగా కూడా ఉంటారు. పండ్లులోని పోషకాల వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. అయితే ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చే కొన్ని రకాల పండ్లను కొంత మంది తినకూడదు. పండ్లు ఆరోగ్యానికి మంచిదే కదా ఏమైంది అని చాలామంది తినేస్తుంటారు. ఇలా తినేస్తే ఇంకా అనారోగ్య సమస్యలు పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కివి పండ్ల గురించి అందరికీ తెలిసిందే. వీటి ఖరీదు ఎక్కువే. అయినా ఆరోగ్యానికి మంచిదని చాలామంది తింటుంటారు. ఇందులో ఉండే పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. బ్లడ్ ప్లేట్లెట్స్ సంఖ్య తక్కువగా ఉన్నవాళ్లు వీటిని తింటే ఒక్కసారిగా పెరుగుతుంది. అయితే వీటిని అందరూ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు అసలు కివి జోలికి పోకూడదు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఇవి ఈ కివి పండ్లు తినకూడదో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
సాధారణంగా కివి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివని వైద్యులు చెబుతుంటారు. అయితే ఇది అంత మందికి కాదు. ఈరోజుల్లో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నారు. ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్లు అసలు కివి జోలికి పోకూడదు. ఇందులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. దీనివల్ల కిడ్నీ సమస్యలు ఇంకా తీవ్రతరం అవుతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు చాలా తక్కువ మోతాదులో మాత్రమే.. పొటాషియం ఉండే పదార్థాలను తీసుకోవాలి. కివిలో విటమిన్స్, యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మ సమస్యలు ఉన్నవాళ్లు కివి పండ్లు తినకపోవడం మంచిది. వీటిని అధికంగా తినడం వల్ల చర్మంపై దద్దుర్లు, అలెర్జీ తామర వంటివి వస్తాయి. కాబట్టి మీకు అలెర్జీ ఉంటే కాస్త వీటికి దూరంగా ఉండండి. గర్భిణీల ఆరోగ్యంగా ఉండాలని కోసం కివి ఎక్కువగా తింటుంటారు. అధికంగా తినడం వల్ల గ్యాస్ట్రిక్, గొంతు నొప్పి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కివి పండ్లు వల్ల కొందరికి జీర్ణక్రియ దెబ్బతింటుంది. అలాగే తలనొప్పి, వాంతులు, విరేచనాలు వంటివి కూడా వస్తాయి. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవాళ్లు అసలు కివి తినవద్దు. వీటితో చేసిన పదార్ధాలను కూడా తినకపోవడం మంచిది. ఒకవేళ తింటే అనారోగ్య సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.