https://oktelugu.com/

Kartika Poornami: మంచి భర్తను కోరుకునేవారు కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేయాలి..

అత్యంత పవిత్రమైన మాసంగా కార్తీక మాసంను పేర్కొంటారు. శివ కేశవులు అనే భేదం లేకుండా ఈ మాసంలో శివ.మ, విష్ణువులిద్దరికీ ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో దీపారాధన చేయడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 13, 2024 / 05:37 PM IST

    Karthika-Pournami

    Follow us on

    Kartika Poornami:  అత్యంత పవిత్రమైన మాసంగా కార్తీక మాసంను పేర్కొంటారు. శివ కేశవులు అనే భేదం లేకుండా ఈ మాసంలో శివ.మ, విష్ణువులిద్దరికీ ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో దీపారాధన చేయడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. జాతకంలో దోషాలు ఉన్న ఈ మాసంలో కొన్ని పరిహారాలు చేయడం వలన తొలగిపోతాయని పేర్కొంటున్నారు. అయితే పెళ్లి కావాలని అనుకుంటున్నారు.. మంచి భర్త రావాలని కోరుకునే అమ్మాయిలు కార్తీకమాసంలో ఇలా చేయడం వలన వారు అనుకున్న వ్యక్తి తమ జీవితంలోకి వస్తారని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే యువతులు ఈ కార్తీకమాసంలో ఏం చేయడం వలన కోరుకున్న భర్తను పొందుతారు? ఆ వివరాల్లోకి వెళితే..

    దీపావళి తర్వాత వచ్చే కార్తీక మాసంలో దీపారాధన ఎక్కువగా ఉంటుంది. ఇళ్లలోనూ.. దేవాలయాల్లోనూ.. నదుల్లోనూ దీపాలను వదులుతూ ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా మహిళలు ఈ మాసంలో నిష్టతో ఉంటూ ఉదయం, సాయంత్రం దీపాలు వెలిగిస్తారు. ఆలయాల్లోనే కాకుండా ఇళ్లలోనూ కార్తీకమాసమంతా దీపాలు వెలిగించడం వలన ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది. అయితే కార్తీకమాసంలో కొన్ని ప్రత్యేక పూజలు చేయడం వలన అమ్మాయిలు తమ కోరుకున్న భర్త ను పొందుతారని అంటున్నారు అందుకోసం ఏం చేయాలంటే?

    తమ జీవితంలో మంచి భర్త రావాలని కోరుకునే అమ్మాయిలు కార్తీక పౌర్ణమి రోజున తులసి కోటలో ఉసిరి కొమ్మను ఉంచాలి. ఇదే ప్రదేశంలో రాధాకృష్ణుల చిత్రాలను ఉంచి అలంకరించాలి. ఆ తర్వాత రకరకాల పువ్వులు, పండ్లను రాధాకృష్ణుల ఫోటోల వద్ద ఉంచాలి. ఆ తర్వాత మనస్ఫూర్తిగా నమస్కరించుకోవడం వలన ఆమె కోరుకున్న భర్తను పొందుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఉసిరి కొమ్మతో కార్తీక మాసంలో పూజలు చేయడం వల్ల అంతా మంచే జరుగుతుంది.

    యువతులు మాత్రమే కాకుండా ఇతరులు కూడా కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగించడం ద్వారా ఎంతో పుణ్యఫలం పొందుతారు. ఉసిరి కాయ అంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టం. అలాగే మహా విష్ణువు కూడా ఉసిరి దీపాలు వెలిగించిన వారిపై అనుగ్రహిస్తాడని పండితులు చెబుతున్నారు. ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాలు వెలిగించడం వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు. శివపురాణం ప్రకారం.. ఉసిరి చెట్టును ఈశ్వర స్వరూపంగా కూడా భావిస్తారు. అందువల్ల కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో ఉన్న ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భావిస్తారు.

    అయితే ఉసిరికా దీపాన్ని ఎలా వెలిగించాలనే సందేహం చాలా మందికి ఉంటుంది. ముందుగా ఉసిరి చెట్టుకింద వరిపిండితో ముగ్గు వేయాలి. ఇందులో పసుపు, కుంకుమలను ఉంచాలి. పూలతో అలంకరించాలి. ఆ తరువాత ఉసిరికాయను కట్ చేసి పై భాగం మొత్తం ఆవు నెయ్యితో నింపాలి. ఆ తరువాత తామర కాడలతో తయారైన వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. దీపానికి పసుపు, కుంకుమను అంటించాలి. ఇలా చేయడం వల్ల వారి జీవితంలో అనుకున్న పనులు పూర్తి చేస్తారని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది.