Tollywood News : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శక నిర్మాతలు కొత్త కథలతో సినిమాలను చేసి మంచి విజయాలను అందుకుంటున్నారు. ఇక అందులో భాగంగానే ఆగస్టు 15వ తేదీన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ముఖ్యంగా తెలుగు నుంచి మూడు సినిమాలు రాగా, తమలం నుంచి విక్రమ్ హీరోగా పా రంజిత్ డైరెక్షన్ లో ‘తంగలాన్ ‘ అనే సినిమా వచ్చింది. అయితే తెలుగులో రవితేజ హీరోగా ‘మిస్టర్ బచ్చన్’ రామ్ హీరోగా ‘డబుల్ ఇస్మార్ట్’, నార్నే నితిన్ హీరోగా వచ్చిన ‘ఆయ్’ అనే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఇందులో ఏ సినిమా మంచి విజయాన్ని సాధించింది ఏ సినిమా ఆశించిన మేరకు అంచనాలను అందుకోలేదనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…
ముందుగా రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’… బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన ‘రైడ్ ‘ సినిమాకి రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. అయినప్పటికీ ఈ సినిమా మీద ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. బెనిఫిట్ షో నుంచే ఈ సినిమా ఫ్లాప్ టాక్ అయితే తెచ్చుకుంది. మరి ఈ మూడు రోజులు హాలిడేస్ ఉండటం వల్ల సినిమాకి కొంతవరకు కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది…
రామ్ పోతినేని హీరోగా, పూరి జగన్నాధ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వల్ గా ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా కూడా ఆశించిన మేరకు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయలేకపోయిందనే చెప్పాలి. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ ఫన్నీగా సాగినప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం సినిమాని ఎక్కడ ఎలా ముగించాలో అర్థంకానీ పూరి జగన్నాధ్ ఇష్టం వచ్చినట్టుగా సినిమా స్టోరీని ముందుకు తీసుకెళ్లాడు. ఫలితంగా సినిమా అనేది నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది…
ఇక తమిళ్, తెలుగులో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న విక్రమ్ తో కలిసి చేసిన తంగలాన్ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో కొంతవరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. అయితే ఈ సినిమా స్లో నరేషన్ లో సాగినప్పటికీ ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు మాత్రం పాజిటివ్ గా స్పందిస్తున్నారు…
ఇక నార్నే నితిన్ హీరోగా ‘ఆయ్ ‘ సినిమా వచ్చింది. చాలా మంచి క్రేజ్ నైతే సంపాదించుకుంది. ఇక ఈ సినిమా కూడా మొదటి షో నుంచే సక్సెస్ టాక్ ను తెచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ నాలుగు సినిమాలు కూడా ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. అయితే ఈ నాలుగు రోజులు గడిస్తే కానీ ఏ సినిమా కలెక్షన్స్ ఎంతలా వచ్చాయి. ఏ సినిమా ఎవరిని బాగా ఏట్రాక్ట్ చేసిందనే విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే లేదు…