https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశివారు ఈరోజు ఖర్చులు పెరుగుతాయి.

ఆర్థిక ఆదాయం పెరుగుతుంది. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. కొత్త వ్యక్తులను కలుస్తారు. వారితో కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : February 11, 2024 / 09:05 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 11న ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఓ రాశివారు అధికంగా ఖర్చులు పెరుగుతాయి. మరో రాశి వారు కొత్త వ్యక్తులను నమ్మొద్దు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

    మేషరాశి:
    వ్యాపారులు అధిక ప్రయోజనాలు పొందుతారు. కొన్ని విషయాలో నోరు జారొద్దు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

    వృషభ రాశి:
    ఆదాయం కోసం కొత్త ప్రణాళికలు వేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు ఇతరులతో సంయమనం పాటించాలి. గతంలో ఉన్న సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి.

    మిథునం:
    ఉద్యోగులకు కార్యాలయాల్లో ఉల్లాసంగా ఉంటుంది. విహార యాత్రలతో ఆనందంగా గడుపుతారు. తోటి వారితో సంతోషంగా గడుపుతారు. అయితే కొత్త వ్యక్తులను నమ్మొద్దు.

    కర్కాటకం:
    ఇతరులకు డబ్బు ఇచ్చేటప్పుుడు వెనకా ముందు ఆలోచించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ఎంత బిజీ ఉన్నా ప్రియమైన వారితో సమయం కేటాయించడం మేలు.

    సింహ:
    ఆర్థిక ఆదాయం పెరుగుతుంది. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. కొత్త వ్యక్తులను కలుస్తారు. వారితో కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు.

    కన్య:
    ఇంటికి అతిథులు వస్తారు. కొన్ని పెట్టుబడులు అనుకూలించకపోవచ్చు. ఇంట్లో ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఓ ముఖ్యమైన సమాచారంతో బిజీగా ఉంటారు.

    తుల:
    కొందరు మిమ్మల్ని డబ్బు అడగవచ్చు. అనుకున్న దాని కంటే ఎక్కువగా ఉత్సాహంగా ఉంటారు. స్నేహితుల్లో కొందరిని నమ్మొద్దు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రాంగానే ఉంటుంది.

    వృశ్చికం:
    ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారితో జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను కాపాడుకోవాలి.

    ధనస్సు:
    ఈ రాశివారు ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. పనితీరుపై ప్రశంసలు వస్తాయి. బంధువులను కలుస్తారు. వ్యక్తిగత జీవితంలో సమస్యలు వస్తాయి. చాలా కాలం తరువాత స్నేహితులను కలుస్తారు.

    మకర:
    కొన్ని రంగాల వారు అద్భుత ప్రయోజనాలు పొందుతారు. ఏదైనా విషయంలో అనుమానం ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

    కుంభం:
    కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సమస్యల నుంచి బయటపడుతారు.

    మీనం:
    ఆరోగ్యం బాగుంటుంది. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది.