Zodiac Signs: శని కేవలం మనుషులను అష్టకష్టాలు కలిగించడం మాత్రమే కాదు ధనాన్ని,సంతోషాన్ని ఇచ్చే దేవుడిగా కూడా నమ్ముతారు. ఇక శని ప్రతికూల ఫలితాలు ఇస్తే ఆ ప్రభావం తట్టుకోవడం కష్టమే. శని గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రయాణం చేయడానికి రెండున్నర సంవత్సరాల కాలం పడుతుందట. ప్రస్తుతం ఓ ఆరు రాశులు ఈ శని ప్రభావానికి గురి కావాల్సిందేనట.
కుంభ రాశిలో శని తిరోగమనం.. జూన్ 29వ తేదీన శని రాత్రి 11 గంటల 41 నిమిషాలకు కుంభరాశిలో తిరోగమనం చెందుతుంది. శని గమన మార్పు నవంబర్ 15 తేదీ వరకు ఉంటుంది. దీని వల్ల 4 రాశుల వారు తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కుంభరాశిలో శని తిరోగమనం వల్ల మేషరాశి, తులా రాశి, వృషభ రాశి, కుంభ రాశి జాతకులకు ఆరు నెలల పాటు ఇబ్బందులు తప్పవు.
మేషరాశి: కుంభ రాశిలో శని తిరోగమనం వల్ల మేష రాశి వారికి అనారోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. శారీరక, మానసిక ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఇక కర్కాటక రాశి వారికి కూడా కష్టానికి తగిన ఫలితం ఉండదట. డ్రైవింగ్ చేసేటప్పుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడటం అవసరం. ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందట.
వృషభ రాశి: వీరు కూడా ఆరు నెలల పాటు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో జాగ్రత్త వహించడం అవసరం. ఈ సమయంలో మీరు ఏం మాట్లాడినా తప్పే అవుతుంది. దీని వల్ల అనేక సమస్యలు వచ్చి పడతాయి. ఏ పని కూడా మొదలు పెట్టకండి. లేదంటే ఆదిలోనే హంసపాదం అవుతుంది. కుటుంబంలో కూడా సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
కుంభరాశి.. కుంభ రాశిలో శని తిరోగమనం వల్ల కుంభరాశి వారు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. మానసిక ఒత్తిడి, తక్షణ సమయంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు పెరిగిపోతాయి. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు వస్తాయి. నవంబర్ వరకు ఎలాంటి వివాదాల్లో తలదూర్చకపోవడమే బెటర్. ఆర్థిక సంక్షోభం వచ్చే ప్రమాదం కూడా ఉంది. తులా రాశి వారు ఆరు నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆర్థిక, ఆరోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. ఇక తులా రాశి వారికి కూడా ఇబ్బందే. దురాశకు పోతే నష్టం, నిరుద్యోగులకు ఆశించిన ఫలితం రాదు. డబ్బులు ఎవరికి ఇవ్వకండి సమయానికి రావు.