https://oktelugu.com/

TANA: తానా ప్రపంచ సాహిత్య వేదికలో గుభాళించిన తెలుగు వెలుగు

తానా అధ్యక్షుడు నిరంజన్‌ శ్రుంగవరపు సభను ప్రారంభిస్తూ సామెతలు మన తెలుగు భాషకు సింగారం అని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందిపై ఉందని పేర్కొన్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 30, 2024 / 12:59 PM IST

    TANA

    Follow us on

    TANA: తానా సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతీనెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆన్‌లైన్‌ సమావేశం ఈ ఆదివారం(ఏప్రిల్‌ 28న) నిర్వహించింది. 67వ సమావేశంలో తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుఉ కథలు అనే కార్యక్రమం ఆసాంతా ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగింది.

    ప్రారంభించిన అధ్యక్షుడు..
    తానా అధ్యక్షుడు నిరంజన్‌ శ్రుంగవరపు సభను ప్రారంభిస్తూ సామెతలు మన తెలుగు భాషకు సింగారం అని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందిపై ఉందని పేర్కొన్నారు. అతిథులకు స్వాగతం పలికారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ సామెతలు, పొడుపు కథలలో పరిశోధనలు చేసిన, చేస్తున్న సాహితీవేత్తలు పాల్గొంటున్న ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకం అన్నారు. తానా ప్రపంచ వేదిక నిర్వాహకులు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ భాషా సౌంరద్యం అనుభవ సారం, నీతి, సూచన, హస్యంకలగలుపులతో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపు కథలు ఆయా కాలమాన ప్రజల సంస్కృతి, సంపద్రాయాలను ప్రతిబింబిస్తూ ఉంటాయని తెలిపారు. వీటిని కల్పోకుండా భావితరాలకు అందించడమే ప్రభుత్వాలు, విద్యాలయాలు, సంస్థలు చేయవల్సిన కృషి ఉందని పేర్కొన్నారు.

    ముఖ్య అతిథిగా తెలుగు పరిశోధకులు..
    ఇక ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పొడుపు కథలలో పరిశోధనచేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకుని, అదే విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేసిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ కసిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. తెలుగు సాహిత్యంలో పొడుపు కథలకు ప్రత్యేక స్థాన ఉందని, విజ్ఞానం, వినోదం, ఆసక్తి కలిగించే పొడుపు కథలకు సృష్టికర్తలు ప్రజలేనని, చమత్కారంచ నిగూఢభావం కలిగిన పొడుపు కథలు పెల్ల పట్టుల్లో, జానపద గేయాలలో కూడా ఉన్నట్లు వివరించారు.

    ప్రత్యేక అతిథి నర్సిమారెడ్డి..
    ఇక ప్రత్యేక అథితిగా హాజరైన డాక్టర్‌ ఊరిమిండి నరసింహారెడ్డి చమత్కర గర్భిత పొడుపు కథలు, ప్రహేళికలు, పలుకుబడులు, పదంబంధాలు మొదైలన సామితీ ప్రక్రియల్నీ మన తెలుగు సిరిసంపదలని వాటి గొప్పదనాన్ని ఒక విహంగ వీక్షణంగా ప్రతిభావంతంగా స్పృశించారు.

    విశిష్ట అతిథులుగా..
    ఇక ఈ సమావేశంలో విశిష్ట అతిథులుగా పూర్వ తెలుగు అధ్యాపకురాలు ప్రముఖ రచయిత్రి, ప్రొఫెసర్‌ సీహెచ్‌.సుశీలమ్మ(గూంటూరు,), కోస్తాంధ్ర ప్రాంత సామెతలపైన నటుడు, ప్రయోక్త, రచయిత, తెలుగు అధ్యాపకుడు జీఎస్,చలం(విజయనగరం), ఉత్తరాంధ్ర ప్రాంత సామెతలపైన మైసూరులోని తెలుగు అధ్యయన పరిశోధన విభాగంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న బినాగశేషు(సత్యసాయి జిల్లా), రాయలసీమ ప్రాంత సామెతలపై, ఉస్మానియా విశ్వవిద్యాలంలో తెలుగు, కన్నడ ప్రాంత వ్యవసాయ సామెతలు, తులనాత్మక పరిశీలన అనే అంశంపై పీహెచ్‌డీ చేస్తున్న బుగడూరు మదన్‌మోహన్‌రెడ్డి(హిందూపురం) వ్యవసాయరంగా సమెతలపై ఎన్నో ఉదాహరణలతో ప్రసంగించారు.