Arunachalam Secrets: లోకాలను ఏలే త్రిమూర్తులలో మహా శివుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అది దేవుడిగా, రుద్రుడిగా, మహాదేవుడిగా పిలవబడే మహాశివుడు అష్టరూపాలను కలిగి ఉన్నాడని చెబుతారు. అలాగే స్మశానంలో కూర్చునే శివుడు విగ్రహా రూపంలో కాకుండా లింగం రూపంలో దర్శనం ఇచ్చి భక్తులను ఆశీర్వదిస్తాడు. అయితే మహాశివుడుని గురించి చెబుతూ.. ఆ స్వామిని కొలవడానికి ప్రతి చోట ఆలయాలను నిర్మించారు. కానీ ఇందులో అరుణాచల శివ క్షేత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. భారతదేశంలో అత్యంత పవిత్రమైన ఆలయంగా భావించి ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడికి వచ్చినవారు గిరి ప్రదక్షణ చేసి ఆధ్యాత్మికత పొందుతారు. అయితే ప్రతి ఏటా కార్తీక మాసంలో ఇక్కడ కొండపై అగ్ని దీపం నిర్వహిస్తారు. ఈ దీపం ప్రత్యేకత ఏంటి? అరుణాచలయ్య ఆలయంలో ఉన్న రహస్యాలు ఏంటి?
మహాశివుడు పంచభూతాలలో కొలువై ఉంటాడని అంటారు. అంటే భూమి, మీరు, అగ్ని, గాలి, ఆకాశం రూపంలో శివుడు దర్శనం ఇస్తాడని చెబుతారు. ఇందులో భాగంగా శివాలయాల్లో లింగం రూపంలో దర్శనమిచ్చే మహాశివుడు కార్తీక మాసంలో జ్యోతి (అగ్ని) రూపంలో మహాశివుడు కనిపిస్తాడని నమ్ముతారు. అందుకే ప్రతి ఏటా నవంబర్, డిసెంబర్ మధ్యలో అరుణాచల క్షేత్రంలో అగ్ని దీపం వెలిగిస్తారు. ఈ అగ్ని దీపం వెలిగించడానికి ఒక పురాణ కథ ఉంది. బ్రహ్మ ఈ లోకాన్ని సృష్టించారని చెబుతారు. విష్ణు లోకాన్ని నడిపిస్తాడని పేర్కొంటారు. అయితే వీరిద్దరి మధ్య ఒకసారి ఎవరు గొప్ప అనే విషయంలో వివాదం ఏర్పడుతుంది. దీంతో ఈ వివాద పరిష్కారానికి చివరి దగ్గరికి వెళ్తారు. అప్పుడు శివుడు వారికి ఒక పరీక్ష పెడతాడు. శివుడు అగ్ని లింగంగా ఏర్పడి మీరు ఇద్దరిలో ఎవరి గొప్ప అనే విషయం తెలియాలంటే నాయందు ఆది, అంతములు తెలుసుకోవాలని చెబుతాడు.
దీంతో బ్రహ్మ హంస వాహనంపై ఆది తెలుసుకునేందుకు పైకి వెళ్తాడు. విష్ణు వరాహ వాహనంపై అంతం తెలుసుకునేందుకు కిందికి వెళ్తాడు. కానీ ఇంత దూరం వెళ్లినా వారు తెలుసుకోలేక పోతారు. చివరికి వారి తప్పులు తెలుసుకున్న బ్రహ్మ, విష్ణువులు శివుడి ముందు పశ్చాత్తాప పడతారు. అయితే ఈ అగ్ని రూపంలో ఏర్పడిన శివలింగం చల్లారి అరుణాచల క్షేత్రంగా ఏర్పడిందని పురాణాల్లో చెప్పారు. అయితే ప్రతి కార్తీక మాసంలో ఈ విషయాన్ని గుర్తు చేయడానికి అరుణాచల కొండపై అగ్ని దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఈ అగ్నిదీపాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తారు.
అయితే అరుణాచల క్షేత్రంలో అనేక రహస్యాలు, నమ్మకాలు దాగి ఉన్నాయి. అరుణాచల కొండ మొత్తం శివుని రూపముగా భావిస్తారు. ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగం జీవించి ఉందని అంటుంటారు. ఈ కొండపై సానుకూలమైన పవనాలు వీస్తాయని నమ్ముతారు. అందుకే కొండ చుట్టూ 14 కిలోమీటర్ల వరకు గిరిప్రదక్షిణ చేస్తారు. ఈ గిరిప్రదక్షిణ అత్యంత భక్తిశ్రద్ధలతో ఉంటుంది. అలాగే అరుణాచల కొండపై అనేక గుహలు ఉన్నాయి, ఇందులో ఇప్పటికీ సిద్ధులు, సన్యాసులు ధ్యానం చేస్తూ ఉన్నారని చెబుతారు. కొంతమంది వారి ఉనికిని గ్రహించామని పేర్కొన్నారు. రమణ మహర్షి ప్రతి రోజు మూడు వేళ్లతో విభూది ధరించేవారని.. ఆ గుర్తులు ఇప్పటికీ అలాగే ఉన్నాయని అంటారు. మొత్తంగా అరుణాచల క్షేత్రం కేవలం ఆలయం మాత్రమే కాదని.. పరమశివుడు కొలువై ఉన్న ప్రదేశం అని భక్తులు నమ్ముతారు.