K Ramp Producer Rajesh: కిరణ్ అబ్బవరం(Kiran Abbbavaram) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం K ర్యాంప్(K Ramp Movie), బాక్స్ ఆఫీస్ వద్ద దీపావళి సర్ప్రైజ్ హిట్ గా నిల్చింది. ఈ సినిమా విడుదలైన రోజు మొదటి ఆట నుండే కొన్ని వెబ్ సైట్స్ ఘోరమైన రివ్యూస్ ఇచ్చాయి. కొన్ని సైట్స్ అయితే హద్దులు దాటి 2 రేటింగ్స్ కూడా ఇచ్చాయి. కానీ సినిమాలో విషయం ఉండడంతో ఆడియన్స్ ఆదరించారు. మొదటి రోజు డీసెంట్ స్థాయి ఓపెనింగ్ వసూళ్లను సొంతం చేసుకున్న ఈ సినిమా, రెండవ రోజున మొదటి రోజుకంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి ట్రేడ్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. వాస్తవానికి ఈ సినిమా ట్రేడ్ అంచనాలను తలక్రిందులు చేసిందనే చెప్పాలి. ఈ దీపావళి కి విడుదలైన సినిమాల్లో ‘డ్యూడ్’ చిత్రం అన్ని సినిమాలను డామినేట్ చేస్తుందని అనుకున్నారు. కానీ K ర్యాంప్ చిత్రం రెండవ రోజు నుండి డ్యూడ్ పై లీడింగ్ తీసుకొని దీపావళి విజేతగా నిల్చింది.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్స్ ని నేడు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. మూవీ టీం మొత్తం ఎంతో ఉత్సాహంగా పాల్గొనింది. కానీ ఆ చిత్ర నిర్మాత రాజేష్ మాత్రం తన సినిమా పై ఒక ప్రముఖ వెబ్ సైట్ పనిగట్టుకొని చేస్తున్న నెగిటివ్ ప్రచారం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అయ్యింది, కానీ ఒక వెబ్ సైట్ మాత్రం ఇంకా ఏడుస్తుంది. వాడికి చెప్తున్నా, అమెరికా లో ఉంటున్న ప్రదీప్ గా, పగలగొడతా, నీకేమి తెలుసురా లుచ్చా నాకొడక, బుక్ మై షో లో డ్యూడ్ చిత్రానికి లక్షా 96 వేల టికెట్స్ అమ్ముడుపోతే, K ర్యాంప్ కి కేవలం 48 వేల టికెట్స్ సేల్ అయ్యాయి అంటున్నావ్, డ్యూడ్ చిత్రం రెండు భాషలకు కలిపి రా కుక్కా, తొక్కుతావా మా సినిమాని, తొక్కురా దమ్ముంటే నాకొడకా, ఒక హిట్ సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ రాస్తున్నాడు వీడు, ఏమి చెయ్యాలి వీడిని?, ఉరి తీయాలి నాకొడుకుని, మా మీద బ్రతికే నాకొడకా’ అంటూ ఉగ్రరూపం దాల్చాడు.
ఈయనేంటి ఈ రేంజ్ లో మాట్లాడుతున్నాడు అని మీరు అనుకోవచ్చు, కానీ ఒక సినిమాని కష్టపడి నిర్మించిన నిర్మాతకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. సినిమా రంగం లో వ్యాపారం అంటే రిస్క్ తో కూడుకున్నది. హిట్ అవుతుందో లేదో తెలియదు, హిట్ అవుతుంది అనే నమ్మకం తో సినిమా మీద ఇష్టం తో, నిర్మాతలు కోట్ల రూపాయిలు అప్పు తీసుకొచ్చి సినిమాలను నిర్మిస్తూ ఉంటారు. కానీ ఈ రివ్యూయర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో షో మొదలు అవ్వకముందే డిజాస్టర్ రివ్యూస్ ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్ చెప్పండి?, అసలు సినిమా విడుదలైన మూడు రోజుల వరకు రివ్యూస్ ఇవ్వకూడదు అనే రూల్ తెస్తే కానీ సినీ ఇండస్ట్రీ బాగుపడదు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
#KRamp producer Rajesh Danda Fires on a website
“మా మీద బ్రతికే నా కొడకా…ఉరి తియ్యాలి నిన్ను…” pic.twitter.com/zlOSDKA80m
— Daily Culture (@DailyCultureYT) October 21, 2025