Vinayaka chavithi 2024 : చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఎంతగానో ఎదురు చూసే.. వినాయక చవితి వచ్చేసింది. చాలా సంతోషంగా ఈ పండుగను అందరూ జరుపుకుంటారు. దేశ వ్యాప్తంగా వినాయకుని ఉత్సవాలను అందరూ ఘనంగా జరుపుకుంటారు. అయితే వినాయక చవితికి ఇంట్లోనే చిన్న మట్టి విగ్రహం తయారు చేసి పూజ చేస్తారు. సాధారణంగా కొందరు వినాయక చవితికి బయట కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు.అయితే ఇండియాలో వినాయకునికి చెందిన ప్రముఖ ఆలయాలు చాలానే ఉన్నాయి. వినాయక చవితి ఉత్సవాలను ఆ ఆలయాల్లో ఘనంగా జరుపుకుంటారు. లైఫ్ లో ఒక్కసారి అయిన దేశంలో ఉన్న ఈ ఆలయాలను సందర్శించుకోవాలి. వినాయక చవితి ఉత్సవాలను ఈ ఆలయాల్లో చాలా ఘనంగా నిర్వహిస్తారు. కేవలం వినాయక చవితి రోజు మాత్రమే కాకుండా వినాయకుని నిమజ్జనం అయ్యే వరకు కూడా ఘనంగా ఉత్సవాలు జరిపిస్తారు. ఈ ఆలయాలు దేశంలో చాలా పురాతనమైనవి. సమయం లేకపోయిన కూడా వీలు చూసుకుని మరి వీటిని తప్పకుండా సందర్శించాలి. మరి ఆ ఆలయలు ఏంటో తెలియాలంటే స్టోరీ పూర్తిగా చదివేయండి.
వరసిద్ధి వినాయక(కాణిపాకం)
వినాయక దేవాలయం అంటే తెలుగు వాళ్లకి ఎక్కువగా గుర్తు వచ్చేది కాణిపాకం. తిరుపతికి దగ్గరగా ఉన్న ఈ ఆలయానికి భక్తులు ఎక్కువగా వెళ్తుంటారు. వినాయక చవితిని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు వంటివి చేస్తుంటారు.
సిద్ది వినాయక(ముంబై)
ముంబైలో ఉన్న సిద్ది వినాయక చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గణపతి ఉత్సవాలని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ వినాయకుడుని దర్శించుకోవడానికి విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఈ ఆలయాన్ని 1801 లో నిర్మించారు. ఈ వినాయకుని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని అక్కడ భక్తులు నమ్మకం. లైఫ్ లో ఒక్కసారి అయిన ఈ వినాయకుని దర్శించుకోవాలి. ముంబైలో గణేశుని ఉత్సవాలను బాగా జరుపుకుంటారు.
చింతామన్ గణేష్(ఉజ్జయిని)
చింతామన్ గణేష్ ఆలయం మహారాష్ట్రలో ఉంది. ఈ ఆలయ గర్భగుడిలో మొత్తం మూడు వినాయక విగ్రహాలు ఉన్నాయి. చింతామన్, ఇచ్చమాన్, సిద్ధి వినాయక అనే మూడు విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం అసలు మిస్ కావద్దు.
గణపతి పూలే(రత్నగిరి)
మహారాష్ట్రలో ఉన్న రత్నగిరి ఆలయం సహజంగా ఏర్పడిందని అంటుంటారు. ఇక్కడికి భక్తులు ఎప్పుడు భారీగా వస్తుంటారు. ఒక్కసారి అయిన ఈ ఆలయాన్ని సందర్శించుకోండి.
శ్రీమంత్ దగ్గుషేత్ హల్వాయి గణపతి(పూణే)
ఈ ఆలయం చాలా ప్రముఖమైనది. ఒక్కసారి అయిన ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోవాలి. ఎందుకు అంటే.. ఈ ఆలయంలో విగ్రహాన్ని బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఒక మిఠాయి వ్యాపారి కుమారుడు వ్యాధితో మరణించడంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.
త్రినేత్ర దేవాలయం(రణతంభోర్)
త్రినేత్ర ఆలయం రాజస్థాన్ లోని రణతంభోర్ లో ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం. ప్రపంచం మొత్తంలోని వినాయక దేవాలయాల్లో ఈ ఆలయం ఒక్కటే పురాతనమైనది. మూడు నేత్రాలతో వినాయకుడు ఈ ఆలయంలో దర్శనమిస్తారు.