https://oktelugu.com/

Car insurance : నోరు తెరిచి అడిగితే రూ.20 వేలు లాభం.. ఎలాగో తెలుసుకోండి..

కొత్త కారును కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఆటోమోబైల్ నిపుణులు. కొత్తగా కారు కొనాలని చూసేవారికి కొన్ని కంపెనీలు మెలికలు పెడుతూ ఉంటారు. వీటిలో ఇన్సూరెన్స్ ఒకటి. కారు కొనుగోలు చేసే సమయంలో ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఇన్సూరెన్స్ కారుకు తప్పనిసరి

Written By:
  • Srinivas
  • , Updated On : September 6, 2024 / 05:32 PM IST

    Car insurance

    Follow us on

    Car insurance : అవును.. కొన్ని విషయాల్లో నోరు తెరిచి అడిగితే చాలా వరకు లాభం పొందుతారు. ముఖ్యంగా ఏదైనా వస్తువు కొనుగోలు విషయంలో అవగాహన ఉండి మాత్రమే ముందుకు వెళ్లాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈరోజుల్లో చాల మంది కొత్త కారు కొనుగోలు చేయాలని చూస్తున్నారు. అయితే తక్కువ ధరకే కారు పొందాలని చాలా మందికి ఉంటుంది. కానీ మంచి ఫీచర్స్, బెస్ట్ ఇంజిన్ కారు కావాలంటే మాత్రమే నిర్ణయించాల్సిన ధరను చెల్లించాల్సిందే. అయితే కొన్ని విషయాల్లో అవగాహన ఉండడం వల్ల తక్కువ ధరకే కారును పొందవచ్చు. ముఖ్యంగా కారు కొనుగోలు చేసేటప్పుడు మెయిన్ వెహికల్ ప్రైస్ తో పాటు ఇన్సూరెన్స్, తదిరత విషయాల్లో రేట్లు ఎలా వేశారో తెలుసుకోవాలి. లేకపోతే చాలా వరకు నష్టపోతారు. అదెలాగంటే?

    కొత్త కారును కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఆటోమోబైల్ నిపుణులు. కొత్తగా కారు కొనాలని చూసేవారికి కొన్ని కంపెనీలు మెలికలు పెడుతూ ఉంటారు. వీటిలో ఇన్సూరెన్స్ ఒకటి. కారు కొనుగోలు చేసే సమయంలో ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఇన్సూరెన్స్ కారుకు తప్పనిసరి కూడా. అయితే ఈ ఇన్సూరెన్స్ ను కారు కొనుగోలు చేసే కంపెనీలోనే తీసుకోవాలని నిబంధన పెడుతారు. ఇలా అయితేనే కారును విక్రయిస్తామని చెబుతారు. అంతేకాకుండా కారు కొనుగోలు చేసే వద్దే ఇన్సూరెన్స్ తీసుకుంటనే భవిష్యత్ లో ఏదైనా అవసరం ఉంటే రెస్సాన్స్ బిలిటీ ఉంటుందని హెచ్చరిస్తారు. బయట ఇన్సూరెన్స్ తీసుకుంటే కారుకు ఏదైనా ప్రమాదం జరిగితే పట్టించుకోమని చెబుతారు. ఈ మాటలను అస్సలు నమ్మొద్దు.

    కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కారు ఇన్సూరెన్స్ ఇక్కడే తీసుకోవాలని ఒత్తిడి చేసినప్పుడు కొందరు తప్పక తీసుకుంటారు. ఈ సమయంలో వారు ఎక్కువ ప్రైస్ తో ఇన్సూరెన్స్ రేటును నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఇన్సూరెన్స్ ప్రైస్ బయట రూ.30 వేలు ఉందనుకుందాం. కానీ కంపెనీ వాళ్లు రూ.50 వేలతో విక్రయించే అవకాశం ఉంది. ఒకవేళ కారు కంపెనీ వాళ్లు ఇన్సూరెన్స్ ధర చెప్పగానే వెంటనే బయట ఏ విధంగా రేటు ఉందో తెలుసుకోవాలి. అక్కడా, ఇక్కడా సేమ్ ఉంటే ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. లేకుంటే కార కంపెనీలో కాకుండా ఇతర సంస్థల వద్ద తీసుకోవాలి. దాదాపు కారు కంపెనీ నిర్ణయించే ఇన్సూరెన్స్ రేటుకు, బయట సంస్థల ధరకు చాలా తేడా ఉంటుంది.

    ఒకవేళ బయట ఇన్సూరెన్స్ కంటే కారు కంపెనీ వాళ్లు ఎక్కువ ధర చెప్పినట్లయితే వారికి అసలు విషయం చెప్పండి. బయట తక్కువ ధరకే వస్తున్నందున ఆ ధరకు ఇస్తే తీసుకుంటామని వివరించండి. అప్పుడు కంపెనీ వాళ్లు ఒప్పుకుంటే సరి. లేకపోతే బయట తీసుకోవడం వల్ల చాల వరకు డబ్బులు ఆదా అవుతాయి. అయితే కొంత మంది కారు కొనుగోలు చేసే సమయంలో ఇలాంటి విషయాలు పట్టించుకోరు. దీంతో కారు కంపెనీవాళ్లు చెప్పిన ధర చెల్లిస్తారు. కానీ నోరు తెరిచి అడగడం వల్ల నష్టపోకుండా ఉంటారు. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.