https://oktelugu.com/

Zodiac signs  : అక్టోబర్ నుంచి ఈ 5 రాశుల వారికి ధనమే ధనం.. ఏ పని చేసినా విజయమే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వచ్చే అక్టోబర్ 9 నుంచి మిథున రాశిలోకి వెళ్లనున్నాడు. ఇలా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు వరకు ఉండిపోతుంది. ఆ తరువాత నుంచి బృహస్పతి రాశి చక్ర గుర్తులపై సానుకూలంగా ఉండనుంది. ఈ క్రమంలో బృహస్పతి తిరోగమనంలో ప్రయాణించడం వల్ల 5 రాశులపై ప్రభావం చూపనుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 6, 2024 / 01:03 PM IST

    Zodiac signs

    Follow us on

    Zodiac signs  : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థితి తరుచూ మారుతూ ఉంటాయి. అయితే ఒక్కో గ్రహం ఒక్కో ప్రత్యేకతను చాటుకున్నందున వాటి స్థాన చలనంతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. దీంతో ఆ రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. గ్రహాలన్నింటిలో బృహస్పతిని గురువుగా భావిస్తారు. దేవ గురువు అయినా బృహస్పతిని శుభసూచకంగా పేర్కొంటారు. ఈ గ్రహం తిరోగమనం చేయనున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వచ్చే అక్టోబర్ 9 నుంచి మిథున రాశిలోకి వెళ్లనున్నాడు. ఇలా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు వరకు ఉండిపోతుంది. ఆ తరువాత నుంచి బృహస్పతి రాశి చక్ర గుర్తులపై సానుకూలంగా ఉండనుంది. ఈ క్రమంలో బృహస్పతి తిరోగమనంలో ప్రయాణించడం వల్ల 5 రాశులపై ప్రభావం చూపనుంది. ఆ రాశులు ఏవో చూద్దాం..

    బృహస్పతి తిరోగమన ప్రయాణం వల్ల మిథున రాశిపై ప్రభావం పడుతుంది.దీంతో ఈ రాశి గల వారికి కొత్త ఆదాయం లభిస్తుంది. బ్యాంకు బ్యాలెన్స్ అధికంగా మారుతుంది. ఇన్నాళ్లు ఉన్న ఖర్చులు తగ్గిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర వహిస్తారు. వ్యాపారులకు అదృష్టం వరిస్తుంది. కొత్త భాగస్వాములు తోడు కావడంతో మూలధనం పెరుగుతుంది. ఫలితంగా లాభాలు వస్తాయి. విద్యార్థులు కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

    కర్కాటక రాశిపై బృహస్పతి కదలిక ప్రభావం పడనుంది. దీంతో వ్యాపారవేత్తలకు బాగా కలిసి వస్తుంది. వీరు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వస్తాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఏ పని చేసినా విజయం వరిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటంబ సభ్యులతో సత్సంబంధాలు పెరుగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. మనసికంగా ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు కెరీర్ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అయితే వీరి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

    బృహస్పతి తిరుగు ప్రయాణం వల్ల ధనస్సు రాశిపై ప్రభావం ఉంటుంది. ఈ రాశి వారి జీవితాల్లో అనూహ్య మార్పులు వస్తాయి. సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకునే వారికి ఇదే మంచి సమయం. సమాజంలో వీరికి కీర్తి ప్రతిష్టలు ఏర్పడుతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. కొత్త ఆదాయం వస్తుంది. అనుకోని అదృష్టం కారణంగా వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ పెరిగే అవకాశం ఉంది. వీరికి సీనియర్ల మద్దతు ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్త కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు.

    వృశ్చిక రాశిపై బృహస్పతి తిరోగమన ప్రభావం పడనుంది. ఈ రాశి వారు ఉల్లాసంగా ఉ:టారు. వ్యాపారంలో ధన లాభం అధికంగా పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు ఉంటే అవి పరిస్కారం అవుతాయి. మానసికంగా ధృఢంగా ఉంటారు. అయితే కొత్త వారితో స్నేహం చేసే ముందు ఆలోచించాలి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.