Mumbai: ముంబైలో మరో ఉపద్రవం.. ఎగిసిపడుతున్న మంటలు.. అసలేం జరిగిందంటే?

దేశ ఆర్థిక రాజదాని ముంబై. ఇక్కడ అనేక వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. దేశ రాజధాని ఢిల్లీ తర్వాత అత్యంత అభివృద్ధి చెందిన నగరం ముంబై. ఎత్తయిన భవనాలు, రద్దీ రోడ్లు, రైళ్లతో ముంబై కిటకిటలాడుతూ ఉంటుంది.

Written By: Raj Shekar, Updated On : September 6, 2024 1:10 pm

Mumbai

Follow us on

Mumbai: కోట్ల మందికి ఉపాధి కల్పించే దేశ ఆర్థిక రాజధాని ముంబై. బాలీవుడ్ కేంద్రం, బిజినెస్‌కు స్వర్గధామం కూడా ముంబైయే.. అందుకే ఇక్కడకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు ఉపాధి కోసం వస్తారు. ఇక ఆకాశాన్ని తాకే భవనాలతో ముంబై మెరిసిపోతుంది. నిత్యం కోట్ల రూపాయల లావాదేవీలు ముంబైలోనే జరుగుతుంటాయి. అందుకే ఆర్థిక రాజధాని అయింది. తాజాగా ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. టెమ్స్‌ టవర్‌లో మంటలు చెలరేగాయి. టైమ్స్‌ టవర్‌ ముంబైలో చాలా రద్దీగా ఉండే ప్రాంతం. శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో లోయర్‌ పరేల్‌ ప్రాంతంలో ఉన్న టైమ్స్‌ టవర్స్‌లో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి.. క్రమంగా అవి పై అంతస్తులకు వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన మంటలు, పొగల కారణంగా చుట్టుపక్కల ప్రజలు, స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఫైర్‌ ఇంజిన్‌ కోసం కాల్‌ చేశారు.

9 ఫైర్‌ ఇంజిన్లతో మంటలు అదుపు..
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 9 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శుక్రవారం ఉదయం కమల మిల్‌ కాంపౌండ్‌లో ఉన్న ఈ ఏడు అంతస్తుల వాణిజ్య సముదాయంలో మంటలు అంటుకున్నట్లుగా తెలిసింది. ఉదయం 6.30 గంటలకు తమకు సమాచారం అందినట్టుగా అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. మంటలను అదుపుచేసేందుకు సిబ్బంది గంటల తరబడి శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ తెలిపింది.

14 అంతస్తుల భవనం..
టైమ్స్‌ టర్‌.. 14 అంతస్తుల భవనం. ఇందులోని ఏడో అంతస్తులో ప్రస్తుతం అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక దళం దీనిని లెవల్‌ 2 (ప్రధాన) అగ్నిమాపకంగా వర్గీకరించింది. 3వ అంతస్తు నుంచి 7వ అంతస్తు వరకు ఉన్న విద్యుత్‌ డక్ట్‌కు మాత్రమే మంటలు అంటుకున్నాయని అధికారులు తెలిపారు.

2017లో కూడా..
ఇదిలా ఉంటే.. 2017 డిసెంబర్‌ 29న అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో 1ఎబోవ్‌లో మొదట మంటలు చెలరేగాయి. ఆపై కమలా మిల్స్‌ కాంపౌండ్‌లోని మోజోస్‌ బిస్ట్రో రెస్టారెంట్‌కి మంటలు వ్యాపించాయి, 14 మంది మరణించారు మరియు అనేకమంది గాయపడ్డారు. రెస్టారెంట్ల యజమానులు, వారి ఉద్యోగులు, బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఆMఇ) అధికారులు, మిల్లు యజమానులతో సహా మొత్తం 14 మందిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ముంబై సెషన్స్‌ కోర్టు నవంబర్‌ 10, 2020న కమలా మిల్స్‌ కాంపౌండ్‌ యజమానులు రమేష్‌ గోవాని, రవి భండారీలను విడుదల చేసింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో..
ఈ ఏడాది ఫిబ్రవరి 26న, ముంబైలోని ఒక వాణిజ్య కేంద్రం భవనంలో మంటలు చెలరేగడంతో మొత్తం 37 మందిని రక్షించారు. శాంతాక్రజ్‌ వెస్ట్‌లోని ఆప్షన్స్‌ కమర్షియల్‌ సెంటర్‌లో సాయంత్రం 5.22 గంటలకు మంటలు చెలరేగడంతో ముంబై అగ్నిమాపక దళానికి కాల్‌ వచ్చింది. రెండు బేస్‌మెంట్‌ స్థాయిలు, ఒక గ్రౌండ్‌ ఫ్లోర్, రెండు పై అంతస్తుల వరకు విస్తరించి ఉన్న వాణిజ్య భవనంలోని రెండవ అంతస్తులోని గాలాపై విద్యుత్‌ వైరింగ్‌ మరియు ఇన్‌స్టాలేషన్‌లకు అగ్నిప్రమాదం ప్రధానంగా పరిమితమైంది.