https://oktelugu.com/

Vikram: తంగలాన్ సక్సెస్ తో మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతున్న విక్రమ్…

ఇండస్ట్రీ లో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి కొన్ని పాత్రలను కొందరు హీరోలు మాత్రమే చేయగలరు. అందులోనూ ప్రయోగాత్మక మైన సినిమాలను చేయాలంటే అది కేవలం విక్రమ్ వల్లే సాధ్యం అవుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : September 6, 2024 / 01:01 PM IST

    Vikram(1)

    Follow us on

    Vikram: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరిలో విక్రమ్ ఒకరు… సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి కూడా విక్రమ్ ప్రయోగాత్మకమైన సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. అందులో శివపుత్రుడు, అపరిచితుడు,నాన్న, ఐ లాంటి సినిమాలు ఉండటం విశేషం… ఇక ప్రస్తుతం ‘ తంగలాన్ ‘ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన మరోసారి ఒక ప్రయోగాత్మకమైన సినిమాను చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక వేత్రి మారన్ దర్శకత్వంలో విక్రమ్ ఒక డిఫరెంట్ పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే వెట్రి మారన్ కి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన ధనుష్ తో చేసిన అసురన్ సినిమా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో పెను ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా ఆయనకి నేషనల్ అవార్డు ను కూడా తీసుకొచ్చి పెట్టింది. ఇక ఇలాంటి క్రమంలో ఆయన డైరెక్షన్ లో విక్రమ్ చేయబోయే సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలియాల్సి ఉంది.

    ఇందులో విక్రమ్ క్యారెక్టర్ ఏంటి అనేది ఇంకా రివిల్ చేయనప్పటికీ ఇది కూడా ఒక ప్రయోగాత్మకమైన సినిమానే అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వెట్రి మారన్ చేసే సినిమాలు అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ఇక విక్రమ్ చేసే క్యారెక్టర్లు కూడా చాలా డిఫరెంట్ డైమెన్షన్ లో ఉంటాయి. కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అంటే తప్పకుండా ఆ సినిమాలో క్యారెక్టర్ రోటీన్ కి చాలా భిన్నంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తంగలాన్ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న విక్రమ్ మరోసారి తను పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.

    ఈ సినిమాతో విమర్శకుల నుంచి భారీ ప్రశంసలను అందుకోవడమే కాకుండా సినిమా చూసిన ప్రేక్షకులందరూ కూడా విక్రమ్ నటనకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నారు. ఇక అందుకే వెట్రీ మారన్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం ఇప్పటినుంచి భారీ కసరత్తులను చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎలాగైనా సరే ఈ సినిమాతో కూడా ఒక సూపర్ సక్సెస్ ని అందుకొని తన ఎంటైర్ కెరియర్ లో తనకు దక్కని సూపర్ సక్సెస్ లను వరుసగా దక్కించుకోవాలనే ఉద్దేశ్యం తో విక్రమ్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.

    విక్రమ్ ఆ పాత్ర కోసం ఎలాంటి కసరత్తులు చేస్తాడు అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి వెట్రి మారన్ సినిమాలో కూడా డిఫరెంట్ పాత్రని పోషిస్తూ అందులోనే వేరియేషన్స్ ను కూడా చూపించే ప్రయత్నంలో విక్రమ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…