Shani Pradosha Vratham : హిందూ శాస్త్రం ప్రకారం శని దేవుడికి ప్రత్యేకత ఉంటుంది. మిగతా దేవుళ్ళలా కాకుండా శనీశ్వరుడని ప్రత్యేకంగా పూజించడం వల్ల ఆ స్వామి అనుగ్రహం పొందవచ్చు. ప్రతి మంగళ, శనివారాల్లో శనిదేవుడని పూజించడం వల్ల ఎన్నో రకాల శుభ ఫలితాలు జరుగుతాయి. అయితే శనీశ్వరుడికి ప్రత్యేక వ్రతం చేయడం వల్ల మరింత సంతోషంగా ఉండగలుగుతారని హిందూ శాస్త్రం తెలుపుతుంది. పురాణాల ప్రకారం శని ప్రదోష వ్రతం చేపట్టడం వల్ల శివుడి అనుగ్రహంతో పాటు శనీశ్వరుడు కూడా తమ భక్తులకు మేలు కలిగేలా జీవిస్తారని చెప్పబడుతుంది. అయితే శని ప్రదోషం అంటే ఏమిటి? ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి?
Also Read : 99,99,999 దేవుళ్ల విగ్రహాల వెనుక రహస్యం. ఉనకోటిలో శివయ్య మర్మమేనా?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రదోషకాలం అంటే సూర్యస్త భయానికి 1.5 గంటల ముందు సూర్యాస్తమం తర్వాత మూడు గంటల సమయం వరకు ఉన్న కాలాన్ని ప్రదోష కాలమని అంటారు. ఈ సమయంలో చేసే వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు. అలాగే దీనిని శని ప్రదోష వ్రతం అని కూడా పిలుస్తారు. శని ప్రదోషం సమయంలో శివారాధన చేయాలి. శివుడితోపాటు శనీశ్వరుడిని పూజించడం వల్ల అనేక రకాలుగా ప్రయోజనాలు పొందగలుగుతారు.
ప్రదోషకాలంలో శివుడుని ఎలా పూజించాలంటే? ప్రదోషకాలం ఏరోజు వస్తుందో ఆ రోజున సూర్యోదయానికి ముందే లేవాలి. పవిత్ర జలాలతో స్నానం ఆచరించాలి. శుభ్రమైన దుస్తులను ధరించాలి. ఆ తర్వాత శివుడు ముందు శివనామ స్మరణ చేస్తూ ప్రదోష వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ సమయంలో శివలింగాన్ని విలువ పత్రాలతో పాటు ఉమ్మెత్త, చందనం, పుష్పాలు సమర్పించాలి. అంతకుముందు పెరుగు, నెయ్యి, తేనె, పంచామృతంతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత శివ మంత్రాలను జపించాలి. ప్రదోష వ్రతం కథ చదివిన తర్వాత శివుడికి హారతిని ఇవ్వాలి. చివరిగా శంకరుడికి నైవేద్యాన్ని సమర్పించి ప్రదక్షణలు చేయాలి.
ఇదే రోజు శనీశ్వరుడిని కూడా పూజించడం వల్ల ప్రదోష వ్రతం సంపూర్ణమవుతుంది. శనీశ్వరుడి విగ్రహాలు ఇంట్లో ఉండవు కనుక.. సాయంత్రం శనీశ్వరుడు ఉండే ఆలయానికి వెళ్లి ఇక్కడ నవగ్రహాలు ఉన్న ప్రదేశంలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. ఆ తర్వాత శనీశ్వరుడికి తైలంతో అభిషేకం చేయాలి. అలాగే నల్లటి నువ్వులతో అభిషేకం చేయాలి.
ఆ తర్వాత ఇంటికి వచ్చి శివుడు తో పాటు శనీశ్వరుడి మంత్రాలను జపించి వ్రతాన్ని పూర్తి చేయవచ్చును. ఇలా చేయడం వల్ల ఇరువురి స్వాముల అనుగ్రహం పొందుతారు. వీరు జీవితంలో ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. శని ప్రదోషకాలంలో పూజలు చేయడం వల్ల శనీశ్వరుడు మరింతగా సంతోషిస్తాడని అంటారు. అలాగే ఈరోజు శివుడిని ఆరాధించడం వల్ల ఆ స్వామి అనుగ్రహం తప్పక ఉంటుందని చెబుతుంటారు. అయితే శని ప్రదోషకాలంలో ఎలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు దైవనామ స్మరణంలోనే గడుపుతూ ఉండాలి. పరుష మాటలు మాట్లాడకుండా ఉండాలి. ఇతరులతో వాగ్వాదాలు లేకుండా చూడాలి. కుటుంబంలో ఎలాంటి తగాదా లేకుండా జాగ్రత్త పడాలి. అంతేకాకుండా ఇంట్లో వారి అనుమతితోనే ఈ వ్రతాన్ని జరపాలి. అప్పుడు ఇల్లు మొత్తం సంతోషంగా ఉంటుంది.
Also Read : ఈ అమావాస్య చాలా ముఖ్యమైనది.. పిండ దానం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే