India vs Pakistan : ఇప్పుడు అందరి దృష్టి ఒకేదానిపై ఉంది. భారత్ పాకిస్తాన్ పై ఎలా యుద్ధం చేయబోతోంది. ఆర్మీ జనరల్స్, వెటరన్స్, టీవీ చర్చల్లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. సముద్రంపై నుంచి కరాచీ నుంచి.. భూభాగంపై లాహోర్ పై దాడి.. సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం ఇలా రకరకాల చర్చలకు దారితీస్తోంది.
అయితే మిలటరీ వ్యూహాలు బయటకు రావు. అయిత ఇది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ను ఆక్రమించుకోవడం ఒక బంగారు అవకాశం. పాక్ ఆక్రమిత కశ్మీర్ రెండు భాగాలివీ.. అజాద్ కశ్మీర్ లో పంజాబీల డామినేషన్ ఉంటుంది. వీళ్లు భారత్ కు ఎప్పుడూ వ్యతిరేకమే.. ముఖ్యమైనది ఉత్తర భాగంలోని గిల్గిట్ బాలిస్తాన్ ముఖ్యమైనది. కశ్మీర్ మహారాజు ఉన్నా కూడా బ్రిటీష్ వారు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. అంతటి స్ట్రాటజిక్ ప్లేసు అది. అక్కడ నుంచి చైనా సియాచిన్ కు వెళ్లొచ్చు. అప్ఘానిస్తాన్ కు వెళ్లొచ్చు. సెంట్రల్ ఏషియాకు వెళ్లడానికి గిల్గిట్ మూలస్థంభంగా ఉంది. షియాలు ఇక్కడ ఎక్కువ. జనాభా బాగా తక్కువ.
ఈ గిల్గిట్ బాలిస్థాన్ లో స్కర్దు అనేది ఇందులో పెద్దపట్టణం. వాళ్లు భారత్ లో కలిసిపోవాలని.. భారత్ కు దారి ఓపెన్ చేయాలని ఆందోళన చేశారు. అది వ్యూహాత్మకంగా భారత్ లో ఈ ప్రాంతం కలిపేస్తారని అంటున్నారు. తూర్పున ఈ ప్రాంతంపై భారత ఆర్మీ దాడి చేస్తోందని భావిస్తోంది.
ఒకప్పుడు లఢక్ లో ఈ గిల్గిట్ బాలిస్థాన్ భాగమే. ఇదంతా పాకిస్తాన్ సరిహద్దు కాదు.. వివాదాస్పద ప్రాంతం. అంతర్జాతీయ సరిహద్దుగా దీన్ని గుర్తించబడలేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ గిల్గిట్ బాలిస్థాన్ ను స్వాధీనం చేసుకుంటే మోడీకి భారీ విజయమే. ఇది జరిగితే భారత్ లో మోడీపేరు చిరస్థాయిగా నిలవడం ఖాయం.
భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోబోతుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
