Homeఎంటర్టైన్మెంట్Sandeep Reddy Vanga: అడ్డంగా బుక్ అయిన సందీప్ రెడ్డి వంగ, సోషల్ మీడియాలో ట్రోలింగ్!

Sandeep Reddy Vanga: అడ్డంగా బుక్ అయిన సందీప్ రెడ్డి వంగ, సోషల్ మీడియాలో ట్రోలింగ్!

Sandeep Reddy Vanga: టాలీవుడ్ ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఆయన టేకింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. క్యారెక్టర్స్ ఇంటెన్స్ తో కూడి ఉంటాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల్లో హీరోల క్యారెక్టర్స్ ఆయన డిజైన్ చేసిన తీరు మెప్పించింది. ఆయన సినిమాల్లో వైలెన్స్, రొమాన్స్ పాళ్ళు కూడా ఎక్కువే. అందుకే విమర్శలు అదే స్థాయిలో వెల్లువెత్తుతాయి. సందీప్ రెడ్డి తెరకెక్కించిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ విమర్శల పాలయ్యాయి. కొందరు చిత్ర ప్రముఖులు సైతం అసహనం వ్యక్తం చేశారు. సందీప్ రెడ్డి సదరు విమర్శలను తిప్పి కొట్టే ప్రయత్నం చేశాడు.

Also Read: జయం సినిమా చిన్నారి ప్రస్తుతం ఎంతలా మారిపోయిందో చూశారా..

యానిమల్ మూవీ పై పార్లమెంట్ లో చర్చ జరగడం విశేషం. ఓ మహిళా ఎంపీ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. ఇక సందీప్ రెడ్డి డెబ్యూ మూవీ అర్జున్ రెడ్డి పై కూడా తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరిగింది. ఈ మూవీ కంటెంట్, సన్నివేశాల మీద మీడియాలో డిబేట్లు నడిచాయి. యూత్ కి మాత్రం అర్జున్ రెడ్డి విపరీతంగా నచ్చేసింది. పెట్టుబడికి పదిరెట్లు లాభాలు తెచ్చిపెట్టింది ఈ చిత్రం. విజయ్ దేవరకొండ ను హీరోగా నిలబెట్టింది. ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. కాగా ఈ మూవీ తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అందుకు కారణం, అర్జున్ రెడ్డి మూవీలోని ఓ సన్నివేశాన్ని సందీప్ రెడ్డి వంగ కాపీ కొట్టాడు అనే ఆరోపణ తెరపైకి వచ్చింది.

అర్జున్ రెడ్డి మూవీలో హీరో లవర్ ని ఒకడు ర్యాంగింగ్ చేస్తాడు. ఈ విషయం తెలిసిన హీరో కోపం కట్టలు తెంచుకుంటుంది. హీరోయిన్ ని బైక్ మీద ఎక్కించుకుని వెళ్లి, ర్యాంగింగ్ చేసిన వాడిని ఆమె ముందే చితకబాదుతాడు. ఈ సీన్ థియేటర్స్ లో బాగా పేలింది. కాగా ఈ సీన్ 1995లో వచ్చిన గుడ్ ఫెల్లాస్ అనే హాలీవుడ్ చిత్రంలోనిది. గుడ్ ఫెల్లాస్, అర్జున్ రెడ్డి సన్నివేశాలు జోడించి వీడియో వైరల్ అవుతుంది.

సందీప్ రెడ్డి కూడా కాపీ క్యాట్ నే, హాలీవుడ్ మూవీ సీన్ మక్కీకి మక్కీ దించేశాడు, అని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ కాపీ ఆరోపణలు అందరు దర్శకులకు కామనే. ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ అని కొనియాడుతున్న రాజమౌళి మీద కూడా కాపీ ఆరోపణలు ఉన్నాయి. ఇక త్రివిక్రమ్ అయితే అజ్ఞాతవాసి చిత్రాన్ని ఒక ఫ్రెంచ్ మూవీ నుండి కాపీ చేసి అడ్డంగా దొరికిపోయాడు. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ హీరో ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

 

Also Read: ఆ హీరోయిన్ అయినా శర్వానంద్ కి హిట్ ఇస్తుందా? సెంటిమెంట్ రిపీట్ అయితేనే

Exit mobile version