Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు ఈ సంవత్సరం పొడవునా కుంభ రాశిలో సంచరిస్తాడు. అయితే ఏప్రిల్ 6 న పూర్వాభాద్ర నక్షత్రం మొదటి స్థానంలో ఉన్న శనిదేవుడు మే 12 నుంచి పూర్వా భాద్ర నక్షత్రం రెండో స్థానంలో సంచరిస్తాడు. శనిదేవుడి నక్షత్ర మార్పు వల్ల కొన్ని రాశులపై ప్రభావం పడనుంది. దీంతో ఆ రాశులు కలిగిన వారి జీవితాల్లో అనుకోని మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవంటే?
శనిదేవుడు పూర్వ భాద్ర నక్షత్రం లోకి ప్రవేశించగానే మేష రాశిపై ప్రభావం చూపనుంది. దీంతో ఈ రాశి కలవారి జీవితాల్లో ఆదాయం పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న నగదు వసూలవుతుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఇవి కలిసి వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
మే 12 నుంచి కన్యా రాశిపై శనిదేవువి ప్రభావం ఉండనుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మానసిక సమస్యలు తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆదాయం పెరగడానికి కొత్త మార్గాలు వస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
కుంభ రాశి వారి వ్యక్తిగత జీవితంలో అనుకోని మార్పులు వస్తాయి. వ్యాపారస్తులు, ఉద్యోగులు కొత్త పనులు ప్రారంభిస్తారు. కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. గతంలో మొదలు పెట్టిన పనుల్లో పురోగతి లభిస్తుంది. ఎన్ని ఆవాంతరాలు ఎదురైనా ముందుకు సాగుతారు. కోర్టు పనులు పరిష్కారం అవుతాయి.