https://oktelugu.com/

కేదార్ నాథ్ యాత్రకు ఎలా వెళ్లాలి? ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఎందుకు?

కేదాన్ నాథ్ వెళ్లేవారు ముందుగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం Registrationandtouristcase.uk.gov.in లో పేరు నమోదు చసుకోవాలి. ఈ యాత్రకి వెళ్లేవారు ఇందులో పేరు నమోదు చేసుకోవడం ద్వారా యాత్రకు వెళ్లిన వారి సంఖ్య ఎంత ఉందో ముందే తెలుసుకోవచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 10, 2024 / 04:13 PM IST

    Kedarnath Temple

    Follow us on

    సౌత్ ఇండియలో ప్రముఖ క్షేత్రం కేదార్ నాథ్ ఆలయం తలుపులు మే 10న శుక్రవారం తెరుచుకున్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా ఈ ఆలయాన్ని ఓపెన్ చేశారు. జీవితంలో ఒక్కసారైన కేదార్ నాథ్ స్వామిని దర్శించుకోవాలని అనుకుంటారు. కానీ కేదార్ నాథ్ యాత్ర అంటే ఆషా మాషీ కాదు. ఈ ప్రయాణంలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కొండల మధ్య ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడి వాతావరణం భిన్నంగానే ఉంటుంది. అయితే కేదార్ నాథ్ ఎలా వెళ్లాలి? ఎటువంటి కేర్ తీసుకోవాలి? అనే వివరాల్లోకి వెళితే..

    ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని దేవ భూమిగా పిలుస్తారు. ఇక్కడ ప్రముఖ ఆలయాలు కొలువై ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలలో ఒకటి కేదార్ నాథ్ ఆలయంలో ఉంది. అందువల్ల ఇక్కడి శివుడిని దర్శించుకోవాలని భక్తులు ఆరాటపడుతూ ఉంటారు. కేదార్ నాథ్ మందిరం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్ర ప్రయాగ జిల్లాలో ఉంది. విమానం ద్వారా వెళ్లాలంటే ఇతర ప్రాంతాల నుంచి డెహ్రడూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్టుకు చేరుకోవాలి. అక్కడి నుంచి 250 కిలోమీటర్ల వరకు ప్రత్యేకంగా టాక్సీ, క్యాబ్ ద్వారా హరిద్వార్ కు వెళ్తారు. రైలు ద్వారా వెళ్లాలనుకునేవారు రిషికేష్ రైల్వేస్టేషన్ కు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేకంగా బస్సుల్లో వెళ్లొచ్చు. అయితే సుందరమైన ప్రదేశాలను చూడాలనుకుంటే ప్రత్యేక వాహనం ద్వారా వెళ్లడం ఉత్తమం.

    కేదార్ నాథ్ యాత్ర చేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి వాతావరణం మిగతా ప్రదేశాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్లే వారు తమ వెంట మొబైల్ చార్జర్, ప్రథమ చికిత్సకు సంబంధించి సామగ్రి, వాటర్ బాటిల్ తప్పనిసరిగా ఉండాలి. ఈ ప్రదేశంలో వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. అందువల్ల వెంట రెయిన్ కోట్ ఉంచుకోవడం మంచిది. ప్రత్యేకంగా వాహనం తీసుకెళ్లేవారు తమ వాహనాన్ని ముందే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

    కేదాన్ నాథ్ వెళ్లేవారు ముందుగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం Registrationandtouristcase.uk.gov.in లో పేరు నమోదు చసుకోవాలి. ఈ యాత్రకి వెళ్లేవారు ఇందులో పేరు నమోదు చేసుకోవడం ద్వారా యాత్రకు వెళ్లిన వారి సంఖ్య ఎంత ఉందో ముందే తెలుసుకోవచ్చు. అలాగే అక్కడి పరిస్థితుల ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కేదార్ నాథ్ యాత్ర మే 10 నుంచి నవంర్ 15 వరకు కొనసాగుతుంది.