https://oktelugu.com/

ఈ వస్తువులు దానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యాలు దక్కుతాయో తెలుసా?

వేసవి రాగానే నీటి కొరత ఉంటుంది. ఈ సమయంలో చాలా మంది నీటి కోసం అల్లాడుతారు. మరీ ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు కొందరు తమ వెంట తాగునీరు ఉంచుకోరు. ఇలాంటి వారికి నీరు దానం చేయాలి. ఇలా వారి దాహార్తిని తీర్చడం వల్ల కైలాస ప్రాప్తి లభిస్తుందని గరుడ పురాణం తెలుపుతుంది. చ

Written By:
  • Srinivas
  • , Updated On : May 10, 2024 / 04:31 PM IST

    donate things

    Follow us on

    పుణ్యం కొద్దీ పురుషులు.. దానం కొద్దీ బిడ్డలు అన్నారు పెద్దలు.. మనిషి జన్మ ఎత్తినందుకు ఎంతో కొంత సాయం చేయాలని పురాణాలు చెబుతున్నాయి.రామాయణ, మహాభారతం ల ప్రకారం మనుషులు ఎలా జీవించాలి? ఎలా బతకాలి? అనే విషయాలపై కథనాలు పేర్కొన్నాయి. గరుడ పురాణం ప్రకారం మానవులు చేసే పనులు వల్ల శిక్షలు ఉంటాయని తెలుస్తుంది. అయితే ఈ శిక్షల నుంచి తప్పించుకోవడానికి కొన్ని దాన దర్మాలు చేయాలని కొందరు అంటున్నారు. దాన ధర్మాలు చేయడం వల్ల ఎలాంటి పుణ్యాలు దక్కుతాయో గరుడ పురాణం తెలుపుతుంది. అయితే ఎలాంటి దానాలు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు సంభవిస్తాయో చూద్దాం..

    వేసవి రాగానే నీటి కొరత ఉంటుంది. ఈ సమయంలో చాలా మంది నీటి కోసం అల్లాడుతారు. మరీ ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు కొందరు తమ వెంట తాగునీరు ఉంచుకోరు. ఇలాంటి వారికి నీరు దానం చేయాలి. ఇలా వారి దాహార్తిని తీర్చడం వల్ల కైలాస ప్రాప్తి లభిస్తుందని గరుడ పురాణం తెలుపుతుంది. చనిపోయిన తరువాత స్వర్గానికి వెళ్లాలని కోరుకునేవారు కచ్చితంగా ఉంటారు. ఇలాంటి వారిలో వైకుంఠనివాసానికి వెళ్లాలనుకునేవారు గోదానం చేయాలని గరుడ పురాణం చెబుతుంది. ఆవుతో పాటు దూడను దానం చేయడం వల్ల శ్రీహరి నివాసంలో చోటు దక్కుతుంది.

    సత్యలోకంలో సుఖ సంతోషాలతో విహారించాలని అనుకుంటారు కొందరు. ఇలాంటి వారు రాగి, నెయ్యి వంటి ఆహార పదార్థాలతో వస్త్రం, మంచం వంటివి ఇతరులకు దానం చేయాలి. అలాగే కేవలం వస్త్ర దానం చేయడం వల్ల వాయు లోకంలో వెయ్యేళ్లు జీవిస్తారట. అగ్నిలోకం అంటే అందరికీ భయమే. కానీ రక్తం, అవయవాలు దానం చేయడం వల్ల ఈలోకంలో ఆనందంగా ఉంటారట. మరుజన్మ కలగాలని కొందరు దీవిస్తారు. ధాన్యం, నవరత్నాలు దానం చేసిన వారు మరుజన్మ ఎత్తుతారట.