Raksha Bandhan 2025: రక్షాబంధన్( Raksha Bandhan ) సందర్భంగా దేశవ్యాప్తంగా రాఖీ పండుగ ఘనంగా జరుగుతోంది. మహిళలు వారి సోదరులకు రాఖీలు కట్టి పండగ చేసుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తన సోదరితో కలిసి రాఖీ పండుగ జరుపుకున్నారు. బాలయ్య కు సోదరి, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి రాఖీ కట్టారు. ఆ తరువాత బాలకృష్ణ తన అక్క కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వీడియోను దగ్గుబాటి పురందేశ్వరి స్వయంగా ట్విట్ చేశారు. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: చంద్రబాబు ఉన్నతి వెనుక రాజశేఖర్ రెడ్డి.. నిజం ఎంత?
ఏకంగా ప్రయాణంలోనే..
అయితే రాఖీ కట్టడం అనేది ఇళ్లల్లో జరుపుకుంటారు. కానీ దగ్గుబాటి పురందేశ్వరి తన సోదరుడికి ఎయిర్పోర్టులో ( airport)రాఖీ కట్టినట్లు కనిపిస్తోంది. అయితే రాఖీ కట్టిన తర్వాత అక్కకు డబ్బులు ఇవ్వాలంటూ నందమూరి బాలయ్య సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే పురందేశ్వరి స్వయంగా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ గా పెట్టారు.’ ఈరోజు రక్షాబంధన్.. నా మనసుకు చాలా దగ్గరైన పండుగ. ఈరోజు నా తమ్ముడు చేతికి రాఖీ కట్టాను. తమ్ముడు ఆరోగ్యంగా, సంతోషంగా, జీవితంలో ప్రతి కల నిజం కావాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు శుభాకాంక్షలు. జీవితంలో మీరు నాకు అండగా ఉన్నారు. మంచి స్నేహితులుగా ఉన్నారు. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. మీ కలలను నెరవేర్చుకోవడానికి శక్తిని పొందాలి. ప్రతి అడుగులో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మనమందరం కలిసి గడిపిన ప్రతి క్షణం నాకు చాలా విలువైనది. భవిష్యత్తులో కూడా సంతోషంగా, ప్రేమగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగ జరుపుకుంటున్న తోబుట్టువులందరికీ శుభాకాంక్షలు. మీ బంధం రోజురోజుకు బలపడాలని కోరుకుంటున్నాను. ప్రపంచంలో ప్రతి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు నా ప్రేమ, ప్రార్థనలు ఎప్పుడు ఉంటాయి. మీరంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ జీవితంలో అన్ని శుభాలే కలగాలని ఆశిస్తున్నాను. రక్షాబంధన్ శుభాకాంక్షలు’ వన్ టూ ట్వీట్ చేశారు.
Also Read: ‘మయసభ’ కాదు ఇదీ.. రాజకీయ ప్రతీకార సభ?
మంచి సంబంధాలు..
అక్క పురందేశ్వరి తో బాలకృష్ణకు( Nandamuri Balakrishna) ఎంతో మంచి సంబంధాలు ఉంటాయి. ఒకరిపై ఒకరు మంచి అభిప్రాయంతో ఉంటారు. తరచూ వారి కుటుంబాలు కలుస్తుంటాయి. గతంలో దగ్గుబాటి కుటుంబం కోరిక మేరకు వారింట సంక్రాంతి వేడుకలకు సైతం నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. చంద్రబాబుతో దగ్గుబాటి కుటుంబం విభేదించే సమయంలో సైతం బాలకృష్ణ వారితో మంచి సంబంధాలే కొనసాగించారు. తన సోదరి పురందేశ్వరి విషయంలో చాలా గౌరవభావంతో ఉంటారు బాలకృష్ణ. మరోసారి వారి మధ్య బంధాన్ని గుర్తుచేసింది ఈ రక్షాబంధన్.
రాఖీ పర్వదినం సందర్భంగా నందమూరి బాలకృష్ణకు రాఖి కట్టిన దగ్గుబాటి పురంధేశ్వరి.#NandamuriBalakrishna #Balakrishna #Rakhi2025 #Tupaki pic.twitter.com/3aD2WX4Or2
— Tupaki (@tupaki_official) August 9, 2025