https://oktelugu.com/

Old Cloths: పాత దుస్తులు దానం చేస్తున్నారా.. ఫస్ట్ ఈ నియమాలు తెలుసుకోండి

వస్త్రాలు దానం చేయడం మంచిదే. కానీ దానం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటో అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. దీనివల్ల దానం చేసిన ఆ ఫలితం మనకి దక్కదు. ప్రతీ ఒక్కరూ కూడా వస్త్రాలు దానం చేసేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. లేకపోతే దానం చేసిన ఫలితం ఉండదు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 6, 2025 / 03:38 AM IST

    cloths

    Follow us on

    Old Cloths: అన్నింటి కంటే దాన గుణం చాలా పెద్దది. ఏ మనిషి అయిన కష్టం వచ్చిందని చేయి చాచకపోయిన సాయం చేయాలి. ఇలా ఎన్నో దానాలు ఉన్నాయి. అన్నదానం, రక్తదానం, వస్త్ర దానం ఇలా ఉన్నాయి. ఏదో ఒక సమయంలో అందరూ కూడా దానాలు చేస్తుంటారు. అయితే ప్రతీ మనిషికి కూడా ఆహారం, వస్త్రాలు చాలా ముఖ్యమైనవి. వీటిని తప్పకుండా వాడుతుంటారు. ఇవి లేకపోతే జీవించడం కూడా కష్టమే. మనం ధరించే దుస్తుల బట్టే మనకి ఎవరైనా కూడా గౌరవం ఇస్తుంటారు. అయితే కొందరు దుస్తుల మీద ప్రీతితో ఎక్కువగా కొనుగోలు చేస్తారు. మళ్లీ వీటిని వేయకుండా అలా ఉంచేస్తారు. వృథా అవుతాయని కొందరు ఇతరులకు దానం చేయాలని అనుకుంటారు. వస్త్రాలు దానం చేయడం మంచిదే. కానీ దానం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటో అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. దీనివల్ల దానం చేసిన ఆ ఫలితం మనకి దక్కదు. ప్రతీ ఒక్కరూ కూడా వస్త్రాలు దానం చేసేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. లేకపోతే దానం చేసిన ఫలితం ఉండదు. మరి వస్త్రాలను దానం చేసేటప్పుడు ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన ఆ రూల్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    నిజానికి ఒకరు ధరించిన దుస్తులు మరోకరు ధరించకూడదని పెద్దలు అంటుంటారు. ఆఖరికి మన సొంత వాళ్ల దుస్తులు కూడా ధరించకూడదని అంటారు. అయితే కొందరు చిరిగినవి, పనికిరాని దుస్తులను దానం చేస్తుంటారు. ఇలాంటి దుస్తులను అసలు దానం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇతరులకు దానం చేసే దుస్తులు మంచిగా ఉండాలి. వాళ్లు ఆ దుస్తులను వాడుకునే విధంగా ఉంటనే దానం చేయాలి. అలాగే ధరించి వాష్ చేయని దుస్తులు దానం చేయకూడదు. మంచిగా వాష్ చేసిన తర్వాత మాత్రమే దుస్తులను దానం చేయాలని పండితులు అంటున్నారు. అయితే ఇతరులకు బట్టలు దానం చేసేటప్పుడు వారి నుంచి రూపాయి అయిన తీసుకోవాలి. వారు ఇవ్వకపోయిన అడిగి మరి తీసుకోవాలి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది. అలాగే కేవలం గురువారం మాత్రమే బట్టలు దానం చేయాలి. ఇలా చేయడం సకల పాపాలు తొలగిపోతాయి. కుజదోషం ఉన్నవారు అయితే స్వెటర్లు, రగ్గులు, దుప్పట్లను దానం చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని, సమస్యలన్నీ కూడా తీరిపోతాయని పండితులు చెబుతున్నారు.

    సాధారణంగా కొన్నింటిని శుభ్రం చేయడానికి పాలలో వస్తువులను ముంచుతారు. అంటే ఇలా చేయడం వల్ల ప్రతికూల ప్రభావం అంతా కూడా పోతుంది. ఇతరులకు దుస్తులు ఇచ్చేటప్పుడు పాలు లేదా ఉప్పులో వాష్ చేసిన తర్వాత ఇవ్వాలని పండితులు అంటున్నారు. అప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారు. వాష్ చేయకుండా దానం చేయడం వల్ల అరిష్టం ఏర్పడుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు. ఉన్న సమస్యలు తీరకుండా ఇంకా పెరుగుతాయని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాత దుస్తులను వాష్ చేయకుండా ఇవ్వకండి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.