Viral Video : దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడల్లా రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా ఆనందదాయకంగా కూడా ఉంటుంది. విమాన ప్రయాణం, రోడ్డు ప్రయాణాలు ప్రత్యామ్నాయాలుగా ఉన్నప్పటికీ, రైలు ప్రయాణంలో ఒక లైఫ్ ఉంది. ఎన్నో కథలు, మరెన్నో గాథలు, ఎంకెన్నో మధురానుభూతులు ఉంటాయి. రైలు శబ్దం, కిటికీ నుండి అందమైన దృశ్యాలు, తోటి ప్రయాణీకులతో కబుర్లు రైలు ప్రయాణం కంటే మించినది మరొకటి లేదని అనిపిస్తుంది. భారతదేశంలోని అనేక నగరాలు, మూలలను కలిపే రైల్వే లైన్లు ఉన్నాయి. అనేక సౌకర్యాలతో కూడిన రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ప్రయాణికుల కోసం మెరుగైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తుంది.
అలాగే సోషల్ మీడియాలో రైళ్లకు సంబంధించిన అనేక వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. కదులుతున్న రైలు నుండి అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన తర్వాత నెటిజన్ల రక్తం ఉడికిపోతోంది. ఇందులో ఓ యువకుడు రైలు కోచ్‌లోని సీటు కవర్లను చించి ఆపై కిటికీలోంచి బయటకు విసిరేయడం చూడవచ్చు. రైలును ధ్వంసం చేస్తున్నప్పుడు యువకుడి ముఖంలో చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా ఓ రీలు వేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వీడియో ఇంటర్నెట్‌లో కనిపించిన వెంటనే, ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో రైలులోని ఖాళీ జనరల్ కోచ్‌లో ఒక యువకుడు సీటు కవర్‌ను చింపివేయడాన్ని మీరు చూడవచ్చు. చేతులతో పరపరమని ఆ యువకుడు సీటు ధ్వంసం చేయడం చూస్తారు. దీని తరువాత, అతను సీటుకు అమర్చిన కిటికీలోంచి బయటకు విసిరాడు. ఇదంతా చేస్తున్న యువకుడు చాలా ఆనందంగా కనిపిస్తున్నాడు కానీ వీడియో చూస్తున్న చాలా మంది రక్తం మరుగుతోంది. వీడియో ఎప్పుడు, ఎక్కడ రికార్డైంది అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. వార్తలు రాసే సమయానికి.. పోస్ట్‌ను 15 లక్షలకు పైగా వీక్షించగా, కామెంట్లు మాత్రం వెల్లువలా వస్తున్నాయి. రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన ఈ యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అతడిని కనుగొని నష్టాన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
The same person will be seen speaking to any YouTuber and abusing the govt, claiming that the railway is in bad condition.
(Location & Time : Unknown) pic.twitter.com/uxJv2o74EP
— Mr Sinha (@MrSinha_) December 31, 2024