Rashi Phalalu: ఈ రాశివారికి ఈరోజు ప్రతికూల వాతవరణం… జాగ్రత్తగా ఉండాలి..

కుటుంబంలో ఇంతకాలం ఉన్న వివాదాలు ముగుస్తాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. శత్రువులను ఓడిస్తారు. సాయంత్రం తల్లిదండ్రులతో ఉల్లాసంగా ఉంటారు.

Written By: Chai Muchhata, Updated On : December 11, 2023 8:27 am

Rashi Phalalu

Follow us on

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. డిసెంబర్ 11న [వారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో సింహం, కన్య రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సందర్భంగా 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
కుటుంబంలో ఇంతకాలం ఉన్న వివాదాలు ముగుస్తాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. శత్రువులను ఓడిస్తారు. సాయంత్రం తల్లిదండ్రులతో ఉల్లాసంగా ఉంటారు.

వృషభం:
ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకూడదు. కుటుంబంతో ఉల్లాసంగా ఉంటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఇతరులతో వాదానలు జాగ్రత్తగా చేయాలి.

మిథునం:
జీవిత భాగస్వామితో సంయమనం పాటించాలి. విహార యాత్రలకు వెళ్లడానికి ప్లాన్ వేస్తారు. ఈరోజు పెట్టుబడులకు అనుకూలం. భవిష్యత్ లో మంచి లాభాలు వస్తాయి.

కర్కాటకం:
పెట్టుబడులు పెట్టేవారికి ఆశించిన లాభాలు రాకపోవచ్చు. అయినా నిరాశ చెందకూడదు. ఉద్యోగులు కొన్ని విషయాల్లో నష్టపోతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహం:
విద్యార్థులకు గురువుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారం విస్తరించవచ్చు. విదేశాల్లో ఉంటున్న వారి నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి.

కన్య:
కొత్త వస్తువులు కొనుగోలు చేసేవారికి అనుకూలం. తల్లిదండ్రులతో ఉల్లాసంగా ఉంటారు. పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తుల:
ఏదైనా విషయంలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవచ్చు. బంధువులతో వివాదం ఉంటే వారితో దూరంగా ఉండడం మంచిది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండాలి.

వృశ్చికం:
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. విద్యార్థులు నైపుణ్యాలు ప్రదర్శించాల్సి ఉంటుంది. పూర్వికుల ఆస్తిని పొందేందుకు అవకాశం. భాగస్వామితో మనస్పర్థలు రావొచ్చు.

ధనస్సు:
సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఇంటికి అతితి రావొచ్చు. ఆధ్యాత్మికతపై ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నా.. వాటిని అధిగమించుతారు.

మకర:
వ్యాపారంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ కారణంగా ఆందోళనగా ఉంటారు. ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి కుదుటపడొచ్చు. తల్లిదండ్రులతో వాగ్వాదం ఉండొచ్చు. వాదించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:
వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సోదరుల మధ్య గొడవ జరిగితే ఈరోజుతో సమసిపోతుంది. కొందరు షాపింగ్ లో పాల్గొంటారు. అవసరాలకు మాత్రమే ఖర్చు చేయండి.

మీనం:
ఉద్యోగులకు ప్రతికూల వాతావరణం. ఖర్చులు పెరుగుతాయి. వాటిని అధిగమించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. సలహాలు తీసుకునేటప్పుుడు వెనకా ముందు ఆలోచించాలి.

Tags