Mobile Said Effect: మొబైల్ ను ఇలా పెట్టి నిద్రిస్తున్నారా? అయితే డేంజర్లో ఉన్నట్లే..

మొబైల్ ను బెడ్ పై పెట్టి పడుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది పక్కనే ఉండడం వల్ల దీని నుంచి వెలువడే రేడియేషన్ మెదడుపై ప్రభావం చూపుతుంది.

Written By: Srinivas, Updated On : December 11, 2023 6:34 pm

Mobile Said Effect

Follow us on

Mobile Said Effect: నేటికాలంలో మొబైల్ లేని చేతులు కనిపించవు . కొన్ని అసవరాలకు ఫోన్ తప్పనిసరిగా అయింది. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి పొద్దు పోయే వరకు మొబైల్ లోనే కాలం గడుపుతున్నారు చాలా మంది. మొబైల్ వాడకంతో రేడియేషన్ మూలంగా అనేక రోగాలు వస్తాయి అని తెలిసినా చాలా మంది దానికే అడిక్ట్ అయిపోయారు. అయితే కొందరు రాత్రి పడుకునే ముందు మొబైల్ వాడుతూ అలాగే బెడ్ పై పెట్టుకొని నిద్రిస్తారు. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే మరోసారి అలా చేయరు. ఇంతకీ బెడ్ పై మొబైల్ పెట్టుకొని పడుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం..

రోజంతా పనులతో బిజీ అయిన వారు రాత్రి నిద్రపోయే ముందు మొబైల్ చూస్తూ పడుకోవడం చాలా మందికి అలవాటు. ఇలా మొబైల్ చూడగా కళ్లకు శ్రమ పడి నిద్ర వస్తుంది. ఇలా నిద్రపోయేవారు. మొబైల్ ను అలాగే బెడ్ పై లేదా పక్కకు పెట్టుకొని పడుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల అనేక రోగాలు కొని తెచ్చుకున్న వారవుతారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనామొబైల్ ను ఎట్టి పరిస్థితుల్లో బెడ్ పై నిర్లక్ష్యగా వదిలేయకూడదు అని కొందరు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మొబైల్ ను బెడ్ పై పెట్టి పడుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది పక్కనే ఉండడం వల్ల దీని నుంచి వెలువడే రేడియేషన్ మెదడుపై ప్రభావం చూపుతుంది. ఈ రేడియేషన్ కారణంగా ముందుగా తలనొప్పి వస్తుంది. రేడియేషన్ మూలంగా వచ్చే తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. దీంతో నిద్రలేమి సమస్యకు కూడా దారి తీస్తుంది. ఆ తరువాత క్రమంగా గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

నిద్రిస్తున్న బెడ్ కు మొబైల్ ను కనీసం 3 అడుగుల దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఉదయం మొబైల్ నుంచి వచ్చే అలారం కూడా రేడియేషన్ ప్రభావం ఉంటుంది. ఫలితంగా మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు మొబైల్ ను దూరంగా పెట్టి నిద్రించండి. బెడ్ పై ఉంచడం వల్ల మైమరిచిపోవడం వల్ల మొబైల్ పాడయ్యే అవకాశం కూడా ఉంది.