Today 20 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాసులపై హస్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి మహాశివుడి ఆశీస్సులు ఉండడంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు కొత్త అవకాశాలు అందుతాయి. మహాశివుడు అనుగ్రహంతో వ్యాపారులు గణనీయమైన లాభాలు పొందుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఏ రోజు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి తోటి వారి సహకారం ఉంటుంది. బంధువుల సహకారంతో అప్పుల నుంచి బయటపడతారు. నాణ్యమైన సమయాన్ని కుటుంబ సభ్యులతో కలుపుతాను. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు కొత్త లాభాలు ఉంటాయి. గతంలో కంటే ఇప్పుడు సంతోషంగా గడుపుతారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు లాభదాయకమైన పనులు చేస్తారు. అనుకోకుండా ధన లాభం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగులు పదోన్నతి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు కొత్త సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోవాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈ రోజు సమాజంలో గౌరవం పొందుతారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. పిల్లల కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుంచి కీలకమైన సమాచారం అందుతుంది. ఉద్యోగులకు ప్రాజెక్టు పూర్తి చేయడానికి తోటి వారి సహాయం ఉంటుంది.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. గతంలో కంటే ఎప్పుడూ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకోకుండా ధన లాభం ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం పెంచుకోవడానికి అనేక మార్గాలు ఏర్పడతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామి సలహా తీసుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు నిర్ణయాలు తీసుకునే సమయంలో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు తోటి వారి సహాయము ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. పెండింగ్ బకాయిలు వస్తువులు అవుతాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. స్నేహితులతో కలిసి విహారయాతులకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపుతారు. అనుకోకుండా ధన లాభం ఉండనుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ధన లాభం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల కెరీర్ కు సంబంధించి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులకు ఒత్తిడి ఉంటుంది. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ఊహించని లాభాలు పొందుతారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. గతంలో మొదలు పెట్టిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
