Makar Sankranti 2025: సూర్యుడు నెలకి ఒక రాశి చొప్పున మొత్తం 12 రాశుల్లో సంచరిస్తాడు. ఇలా ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు సంక్రాంతి (Sankranti) పండుగను జరుపుకుంటారు. మొత్తం మూడు రోజులు పాటు ఈ పండుగను (Festival) ఘనంగా నిర్వహిస్తారు. ఎంతో ఆనందంగా ప్రజలంతా ఘనంగా ఈ సంక్రాంతి (Sankranti) పండుగను జరుపుకుంటారు. కొత్త దుస్తులు, హరిదాసులు, గాలి పటాలు, పిండి వంటలు ఇలా ఎంతో సంతోషంగా (Happy) కుటుంబ సభ్యులతో ఘనంగా చేస్తారు. అయితే చాలా మందికి ఈ సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారో కూడా తెలియదు. అసలు దీని విశిష్టత ఏంటని తెలియకుండా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అన్ని పండుగల్లో సంక్రాంతి (Sankranti) పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఏపీ ప్రజలకు ఇదే పెద్ద పండుగ. మరి దీని విశిష్టత ఏంటి? ఎందుకు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సంక్రాంతి పండుగను జనవరి నెలలో జరుపుకుంటారు. ఈ సమయంలో పొలాల నుంచి వచ్చే ధాన్యంతో ఇళ్లు నిండుతుంది. అయితే ఇలా వచ్చిన కొత్త బియ్యంతో ఎవరూ కూడా వంటలు చేయరు. మొదటిగా దేవుడికి నైవేద్యం చేసి పెడతారు. బెల్లం, అన్నంతో కలిపి పొంగలి చేసి పెడతారు. ఇలా సంక్రాంతిని పొంగల్ అని అంటారు. అలాగే సంక్రాంతి పండుగకి అందరూ కూడా నువ్వులతో వంటలు చేస్తారు. పిండి వంటల్లో ఎక్కువగా నువ్వులు వాడుతారు. ఇవి శరీర ఆరోగ్యా్న్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడతాయని పండితులు అంటున్నారు. నువ్వులలో ఉండే పోషకాలు శరీరానికి వేడి చేస్తాయి. దీని వల్ల చలి నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతారు. అలాగే సంక్రాంతికి ఇంటి పెద్దలకు పిండాలు పెడతారు. అంటే వారికి కొత్త బట్టలు చూపించి, వారు స్వర్గానికి వెళ్లాలని కోరుకుంటారు. దీనివల్ల వారికి మోక్షం కలుగుతుందని నమ్ముతారు. ఇలా వారికి అన్ని పెట్టడం వల్ల దీన్ని పెద్దల పండుగ అని కూడా పిలుస్తారు.
సంక్రాంతి పండుగ రోజు పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. అలాగే వారి పేరు మీద బ్రాహ్మణులకు దానం కూడా చేస్తారు. భూదానం, సువర్ణదానం, వెండిదానం, అన్నదానం, పుస్తకదానం, బియ్యం, పప్పు, ఉప్పు, గుమ్మడికాయ ఇలా కొన్ని రకాలను దానం చేస్తారు. ఎవరి స్తోమతను బట్టి వారు వస్తువులను దానం చేస్తుంటారు. ఇలా దానం చేయడం వల్ల కుటుంబానికి వారి ఆశీస్సులు అందుతాయని నమ్ముతారు. సంవత్సరంలో ఈ ఒక్క రోజు తప్పకుండా పితృ దేవతలకు తప్పకుండా ఇలా పూజించాలి. అప్పుడే వారు సంతోష పడతారని నమ్ముతారు. వారికి కొత్త దుస్తులు, నచ్చిన వస్తువులతో వారిని పూజిస్తారు. సంక్రాంతి అంటే కొత్త దేవుడిని పూజించడం కాదు.. మన పెద్దలను పూజించడమే ఈ పండుగ. అందుకే ఈ పండుగను ఘనంగా అందరూ కూడా జరుపుకుంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు కోసం పండితులను సంప్రదించగలరు.