https://oktelugu.com/

Sankranthiki Vastunnam: ఆశ్చర్యపరుస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ అడ్వాన్స్ బుకింగ్స్..వెంకటేష్ ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని గ్రాస్ వసూళ్లు ఇవి!

అనిల్ రావిపూడి తో విక్టరీ వెంకటేష్ ముచ్చటగా మూడవసారి కలిసి చేసిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు నిర్మాతగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాలోని మాటలకు ఎంతటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : January 12, 2025 / 08:44 PM IST
    Follow us on

    Sankranthiki Vastunnam:  ఒకప్పుడు సీనియర్ హీరోస్ లో విక్టరీ వెంకటేష్ కి ఉన్నంత సక్సెస్ రేట్ చిరంజీవి, బాలకృష్ణ వంటి వారికి కూడా లేదు అనేవారు ట్రేడ్ పండితులు. ప్రతీ సంవత్సరం ఆయన ఎదో ఒక సినిమాతో ఇండస్ట్రీ ని షేక్ చేసేవాడు. కానీ వెంకటేష్ ఈమధ్య కాలం లో సోలో హీరో గా హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. 2007 వ సంవత్సరం లో విడుదలైన ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’, ‘తులసి’ చిత్రాలే ఆయన చివరి కమర్షియల్ సూపర్ హిట్స్. ఆ తర్వాత సోలో హీరో గా చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. మధ్యలో ‘దృశ్యం’, ‘గురు’ వంటి చిత్రాలు పర్వాలేదు అనే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద ఆడినప్పటికీ, వెంకటేష్ స్థాయికి తగ్గ సూపర్ హిట్స్ మాత్రం కాదు. మల్టీస్టార్రర్ చిత్రాలు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గోపాల గోపాల, ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటివి బాగానే ఆడాయి.

    ఇప్పుడు ఆయన అనిల్ రావిపూడి తో ముచ్చటగా మూడవసారి కలిసి చేసిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు నిర్మాతగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాలోని మాటలకు ఎంతటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా ‘గోదారి గట్టు మీద’ సాంగ్ వినిపిస్తూనే ఉంది. కేవలం ఆ ఒక్క పాట మాత్రమే కాదు, ఆ తర్వాత విడుదలైన రెండు పాటలకు కూడా యూట్యూబ్ షేక్ అయ్యింది. రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. దీంతో ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. రీసెంట్ గానే బుక్ మై షో లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా టికెట్స్ ప్రతీ ప్రాంతంలో హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి.

    బుక్ మై షో లో ఈ సినిమాకి ప్రస్తుతం గంటకు 10 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఏ రేంజ్ ట్రెండ్ ఉందో మీరే అర్థం చేసుకోండి. ఇంకా పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు అవ్వలేదు. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చింది, ఇక నేడు విడుదలైన బాలయ్య ‘డాకు మహారాజ్’ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ బాలయ్య సినిమాని చూసేందుకు అంతగా అమితాసక్తి ని చూపించరు. దీంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఒక్కసారిగా బజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఊపు చూస్తుంటే ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి పది కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 34 కోట్ల రూపాయలకు జరిగింది. టాక్ వస్తే కేవలం మూడు రోజుల్లో ఈ మార్కుని అందుకుంటుంది. బయ్యర్స్ కి లాభాలే,లాభాలు, చూడాలి మరి ఏమి జరగబోతుందో.

    Tags