Makar Sankranti 2025: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి (Sankranti) పండుగను మొత్తం నాలుగు రోజులు జరుపుకుంటారు. భోగితో (Bhogi) మొదలు అయ్యి.. ముక్కు కనుమ (Kanuma) వరకు పండగను ఘనంగా జరుపుకుంటారు. అయితే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కు కనుమ ఇలా నాలుగు రోజులు పాటు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎంతో సంతోషంగా (Happy) పండుగను నిర్వహిస్తారు. అయితే సంక్రాంతి మరుసటి రోజు వచ్చే పండుగను కనుమ (Kanuma) అంటారు. ఈ కనుమ పండుగ రోజు అందరూ కూడా పశువులను అందంగా అలంకరించి జరుపుకుంటారు. ఎందుకంటే కుటుంబంలో (Family) పశువులు కూడా భాగమే. అన్నం తినాలంటే రైతులు వ్యవసాయం (Farming) చేయాలి. ఈ వ్యవసాయానికి భూమి, ఆవులు, ఎడ్లు కూడా అవసరమే. వీటికి గుర్తింపునిస్తూ.. పశువుల పండుగగా కనుమను జరుపుకుంటారు. సంక్రాంతి తర్వాత కనుమ పండుగను ఎంతో ఘనంగా అందరూ కూడా జరుపుకుంటారు. కనుమ రోజు ఆవులు, గేదెలు, ఎద్దులకు పసుపు, కుంకుమ, పూలు పెట్టి అందంగా అలంకరిస్తారు. అలాగే కాళ్లకు గజ్జలు కూడా కట్టి మెడలో గంటలు వేస్తారు. పశువులను ఇలా అందంగా రెడీ చేసి అవి ఆరోగ్యంగా ఉండాలని వాటిని పూజిస్తారు.
కనుమ రోజు పశువులను పూజించడంతో పాటు పాలు, కొత్త బియ్యంతో పొంగలి వండుతారు. ఎందుకంటే ఈ మాసంలో కొత్త ధాన్యం ఇంటికి వస్తాయి. వీటిని బియ్యంగా మార్చి పొంగలి చేసి నైవేద్యంగా పెడతారు. ఆ తర్వాత పొలాల్లో కూడా చల్లుతారు. ఇలా చేయడం వల్ల పంటలకు చీడ పురుగులు వంటివి రాకుండా ఉంటాయని నమ్ముతారు. అలాగే కనుమ పండుగ రోజు మినుములు తినాలనే మన పెద్దలు చెబుతున్నారు. వీటిని తింటే మంచిదని అందుకే మినుమలతో పిండి వంటలు చేస్తారట. వీటితో గారెలు, బూరెలు వంటివి చేస్తారు. అలాగే కనుమ రోజు ఎవరూ కూడా ఇంటి నుంచి ఎక్కడికి వెళ్లకూడదు. ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడపిల్లలు అయితే అసలు వెళ్లకూడదని చెబుతుంటారు. అలాగే కనుమ పండుగ రోజు మాంసాహారం వండుతారు. తప్పకుండా మాంసం వండకుండా మానరు. అయితే ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఇలా సంక్రాంతి పండుగను ప్రతీ ఒక్కరూ కూడా జరుపుకుంటారు. ఇదొక ఆచారంగా ఎన్నో రోజుల నుంచి వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తప్పకుండా ఈ ఆచారాన్ని పాటిస్తారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.