https://oktelugu.com/

Daaku Maharaj Movie: ‘డాకు మహారాజ్’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..’గేమ్ చేంజర్’ కంటే రెండు రెట్లు ఎక్కువ..బాలయ్య మాస్ విశ్వరూపం!

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం 'డాకు మహారాజ్' ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బాలయ్య లోని సరికొత్త యాంగిల్ ని ఆడియన్స్ కి చూపిస్తూ, బాబీ చేసిన ఈ సరికొత్త ప్రయత్నం కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : January 14, 2025 / 06:17 PM IST
    Follow us on

    Daaku Maharaj Movie: నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం ‘డాకు మహారాజ్’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బాలయ్య లోని సరికొత్త యాంగిల్ ని ఆడియన్స్ కి చూపిస్తూ, బాబీ చేసిన ఈ సరికొత్త ప్రయత్నం కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తక్కువ మాటలతో, ఎక్కువ హీరోయిజం చూపించడం లో బాలయ్య బాబు అద్భుతమైన పరిణీతి చూపించాడు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో పాతి కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టిన సినిమాగా సంచలనం సృష్టించింది. ఇక రెండవ రోజు అయితే రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ రెండవ రోజు వసూళ్లకంటే ఎక్కువ వచ్చింది. ‘గేమ్ చేంజర్’ రెండవ రోజు 8 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, ‘డాకు మహారాజ్’ చిత్రానికి రెండవ రోజు 9 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

    ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లు వచ్చాయి?, ప్రాంతాల వారీగా ఎంత రాబట్టింది అనేది ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. నైజాం ప్రాంతం లో 7 కోట్ల 61 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ ప్రాంతంలో 6 కోట్ల 95 లక్షలు, ఉత్తరాంధ్ర లో 4 కోట్ల రూపాయిలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 3 కోట్ల 30 లక్షలు, వెస్ట్ గోదావరిలో 2 కోట్ల 58 లక్షలు, గుంటూరు జిల్లాలో 5 కోట్ల 60 లక్షలు, కృష్ణ జిల్లాలో 3 కోట్లు, నెల్లూరు జిల్లాలో 2 కోట్ల 22 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రెండు రోజులకు గాను 35 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.

    ఇక ఇతర ప్రాంతాల్లో వచ్చిన వసూళ్ల విషయానికి వస్తే కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలిపి రెండు కోట్ల 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఓవర్సీస్ లో 6 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా ఓవరాల్ గా రెండు రోజుల్లో 44 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇది బాలయ్య గత చిత్రాలకంటే చాలా ఎక్కువ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 80 కోట్ల రూపాయలకు జరిగింది. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాలయ్య కి వరుసగా ఇది నాల్గవ హిట్ అనొచ్చు. ఈ చిత్రం తర్వాత ఆయన అఖండ 2 చేస్తున్నాడు. దీనికి ఏ రేంజ్ రాంప్యేజ్ ఉంటుందో ఊహించడం కూడా కష్టమే.