https://oktelugu.com/

Sankranthiki Vastunnam : సంక్రాంతికి వస్తున్నాం ‘ సినిమాలో కొరికెత్తాను అంటూ సందడి చేసిన ‘బుల్లిరాజు ‘ ఎవరు? బుడ్డోడి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు విభిన్న తరహా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ కమర్షియల్ సినిమాలుగా వస్తున్న వాటికి మాత్రం ప్రేక్షకుల్లో ఎప్పుడు ఆదరణ అయితే లభిస్తూనే ఉంది. కొత్త జోనర్స్ ని ఎంకరేజ్ చేస్తున్న మన ఆడియన్స్ కమర్షియల్ సినిమాలు బాగుంటే వాటిని కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు...

Written By:
  • NARESH
  • , Updated On : January 14, 2025 / 06:04 PM IST

    Sankranthiki Vastunnam Trailer Review

    Follow us on

    Sankranthiki Vastunnam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలామంది హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక హీరోలతో పాటుగా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క నటుడు కూడా ఇండస్ట్రీలో అమితమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా వరుస సక్సెస్ను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ సైతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. మరి ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి. అదే మాదిరిగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించి ఆయన ఖాతాలో మరొక సక్సెస్ ని జత చేసిందనే చెప్పాలి.

    ఇక ఇదిలా ఉంటే వెంకటేష్ ఈ సినిమాలో చినరాజు నటించి మెప్పించాడు. ఇక అతని కొడుకుగా ‘బుల్లి రాజు’ అనే పాత్రలో నటించిన కుర్రాడు సినిమా మొత్తాన్ని తిప్పేసాడనే చెప్పాలి. ఆ బుడ్డోడు కనిపించిన ఎపిసోడ్స్ మాత్రం థియేటర్లో హిలేరియస్ గా ఫ్యాన్ వర్కౌట్ అయింది. ఇక ఆ పిల్లాడి కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. సిచువేశన్ కి తగ్గట్టు గా ‘కొరికెత్తాను ‘ అనే మేనరిజం తో తన నటన ప్రతిభను చూపిస్తూ ఎక్స్ ట్రా ఆర్డినరీ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు…

    ఇక చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన బుల్లి రాజు అసలు పేరు రేవంత్…ఇక సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ ఈవెంట్ లో కూడా ఈ బుల్లిరాజు సందడి చేశాడు.. ప్రస్తుతం ఈ సినిమా మొత్తం లో ఈ అబ్బాయి గురించే మాట్లాడుకోవడం విశేషం. ఇక 2025వ సంవత్సరంలో చేయబోతున్న చాలా సినిమాల్లో ఇతడికి మంచి ఆఫర్లు కూడా దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక తన టాలెంట్ ని గుర్తించి సినిమాలో అద్భుతమైన పాత్రను క్రియేట్ చేసిన అనిల్ రావిపూడి గ్రేట్ అని చెప్పాలి.

    ఇక ఈ సినిమాలో అతని పాత్ర చిన్నపిల్లలనే కాకుండా పెద్దవాళ్ళను కూడా అలరిస్తుంది. ఇక ఇప్పటి వరకు వచ్చిన పిల్లల పాత్రల్లో రేవంత్ చేసిన బుల్లిరాజు పాత్ర నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి… ఇక ఈ సంక్రాంతి సినిమాల్లో విక్టరీ వెంకటేష్ సంక్రాంతి విన్నర్ గా నిలిచారనే చెప్పాలి. మరి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ను సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది…