Mahavir Jayanti 2024: హిందూ పంచాంగం ప్రకారం చైత్రమాసం శుక్ల పక్షం త్రయోదశి రోజున మహావీర జయంతి. జైన మతానికి చెందిన ధర్మ ప్రచార గురువు మహావీరుడు. అందుకే ఆయన జయంతి రోజు చైన మతస్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. మహావీర్ జయంతి రోజు జైన మతస్తులు ఆయన గైరవారథం ప్రభాత్ పేరీ, ఊరేగింపు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. నేడు మహావీర్ జయంతి సందర్భంగా ఆ జైనమత ధర్మప్రచారకుడి గురించి కొన్ని విశేషాలు..
పంచ సూత్రాలు…
మానవునిగా పుట్టిన ప్రతి ఒక్కరూ మోక్షం పొందాలంటే ఐదు సూత్రాలు తప్పక పాటించాలని మహావీరుడు బోధించాడు. అవేంటో చూద్దాం.
పంచ సిద్దాంతం పరమోదర్మః
మహావీరుడు బోధించిన అహింస, ఆస్తేయ బ్రహ్మచర్యం, సత్యం, అపరిగ్రహం అనే ఐదు సూత్రాలను మహావీరుడు బోధించారు. ఆయన జయంతి రోజు ప్రజలందరూ స్మరించుకుంటూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రజు పవిత్రమైన రోజుగా భావించి కఠిన ఉపవాస దీక్ష చేస్తారు.
ఎవరీ మహావీరుడు…
జైనమత ధర్మ ప్రచారకుడు అయిన మహావీరుడు క్రీస్తు పూర్వం 599 బీసీ కాలంలో బీహార్‌లో లార్డ్ మహావీర్ రాజు సిద్ధార్థ చాణి త్రిసాల దంపతులకు జన్మించాడు. వర్ధమాన్ అనే మహావీరునికి 28 ఏల్ల వయసులో తండ్రి మరణించాడు. రాజ్య బాధ్యతలు స్వీకరించారు. యశోధర అనే యువతిని వివాహం చేసుకుంటారు. వీరికి ఒక కూతురు ఉంది.
ఐహిక సుఖాలపై వైరాగ్యం…
రాజు అయిన వర్ధమాన మహావీరుకి రాజభోగాలపై, విలాసాలపై ఎలాంటి ఆసక్తి ఉండేది కాదు. ఎప్పుడు కూడా తన ఉనికిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తు ఉండేవాడు. ఈ క్రమంలో మహావీరుడు వైరాగ్యంతో తన 36వ ఏట రాజ్యాన్ని, ఐహిక సుఖాలను వదిలేసి అంతర్గత శాంతి కోసం ప్రశాంతత కోసం అడవులకు వెళ్లి దాదాపు 12 ఏళ్లు తపస్సు చేశాడు.
జానోదయం..
12 ఏళ్ల కఠిన తపస్సు తర్వాత మహావీరునికి జ్ఞానోదయం కలిగింది. వర్ధమానుడు మహావీరుడిగా మారాడు. తాను సంపాదించిన జ్ఞానాన్ని నలుగురికి పంచిపెట్టడానికి మగధ రాజ్యంతోపాటు తూర్పునకు వెళ్లి తన సిద్ధాంతాలను బోధించాడు. బిండిసారుడు, అజాత శత్రువు తదితర రాజులను కలిశాడు.
మహావీరుని సిద్ధాంతాలు ఇవీ…
– మిమ్మల్ని మీరు జయించండి. ఎందుకంటే కోటి మంది శత్రువులను జయించడం కంటే ఈ ఒక్కటి ఉత్తమ విషయం
– ప్రతీ ఆత్మ తనంతట తాను ఆనందమయుడు. సర్వజ్ఞుడు. ఆనందం అనేది మనలోనే ఉంటుంది. దానిని బయట వెతుక్కునేందుకు యత్నించొద్దు.
– దేవుని ప్రత్యేక ఉనికి అంటూ ఏమీ లేదు. మనం సరైన ప్రయత్నాలు చేస్తే దైవత్వాన్ని పొందవచ్చు.
– అన్ని జీవులపై అహింసా వాదంతో ఉండాలి. మనసుతో, మాటలతో శరీరంతో ఎవరినీ హింసించకపోవడం నిజమైన ఆత్మ నిగ్రహం.
– విజయం సాధిస్తే పొంగిపోవద్దు. ఓటమికి కుంగిపోవద్దు. భయాన్ని జయించిన వారు ప్రశాంతంగా ఉంటారు.
72వ ఏట అస్తమయం..
దేశం నలుమూలలు తిరిగి తన సిద్ధాంతాలు వ్యాప్తి చేసిన మహావీరుడు తన 72వ ఏట తుదిశ్వాస విడిచాడు. ఇందుకు మునుపు 23 మంది తీర్ధంకరులు ఉన్న మహావీరుని హయాంలోనే జన మతానికి విశేషమైన గుర్తింపు వచ్చింది. అందుకే 32 ఏళ్లపాటు అహింస, ధర్మం గురించి ప్రచారం చేసిన మహావీరుడు జైనులకు ఆరాధ్య దైవమయ్యాడు.