maha kumbh mela: ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవాల్లో మహా కుంభమేళా ఒకటి. ఈ ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించనున్నారు. అయితే ఈ మహా కుంభమేళాకు లక్షలాది భక్తులు వెళ్తుంటారు. పవిత్ర నదులు అయిన గంగా, యమునా, సరస్వతి మూడు నదుల సంగమంలో స్నానం చేయడానికి భక్తులు ఎక్కువగా వెళ్లడానికి ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ మహా కుంభమేళా మొత్తం నాలుగు ప్రదేశాల్లో జరుగుతుంది. అలహాబాద్ ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లో జరుగుతుంది. ఎంతో అంగరంగవైభవంగా జరిగే ఈ మహా కుంభమేళాను 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ఇలా 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాకు అధిక సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. ముఖ్యంగా అఘోరాలు ఎక్కువగా కనిపిస్తారు. అయితే ఈ మహా కుంభమేళాకు వెళ్లే వాళ్లు తప్పకుండా కొన్ని వస్తువులను తీసుకెళ్లాలి. మరి ఆ వస్తువులు ఏంటో చూద్దాం.
మహా కుంభమేళాలో ఎక్కువగా జనం ఉంటారు. అలాగే దీనివల్ల వాహనాలు పార్కింగ్ ఇలా అన్ని రకాలను కూడా కాస్త దూరంలో ఉంచుతారు. దీంతో మీరు ఎక్కువ దూరం నడవాల్సి ఉంది. ఎక్కువగా నడవడం వల్ల బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి మీతో ఎల్లప్పుడు వాటర్ బాటిల్ ఉండేలా చూసుకోండి. మీరు హైడ్రేట్‌గా లేకపోతే కళ్లు తిరిగి పడిపోయే ప్రమాదం ఉంది. అలాగే చిన్న గొడుగును కూడా బ్యాగ్‌లో ఉంచుకోవాలి. దీని వల్ల మీకు సూర్యరశ్మి నుంచి కాస్త విముక్తి కలుగుతుంది. ఎక్కువగా జనం ఉన్న ప్రదేశాల్లో ఫుడ్ దొరకదు. దీంతో మీకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు బ్యాగ్‌లో డ్రైఫ్రూట్స్, వేరుశనగలు, బ్రెడ్ వంటివి క్యారీ చేయండి. మీకు ఏం తినాలనిపిస్తే అవి తీసుకెళ్లడం మంచిది. దీనివల్ల మీకు ఫుడ్ దొరకకపోయిన కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
బయట పరిశుభ్రత ఉండదు. కాబట్టి మీరు బ్యాగులో శానిటైజర్, పేపర్ సబ్బు, హ్యాండ్ టవల్ వంటివి తీసుకెళ్లాలి. మీరు కూడా కనీస వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. అప్పుడే మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే దగ్గు, జలుబు, జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి వాటికి మందులు తీసుకోవాలి. సడెన్‌గా మీకు అనారోగ్య సమస్యలు వస్తే ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ ఫస్ట్ ఎయిడ్‌ను ఉపయోగించండి. అలాగే మీరు ఒక గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఎంట్రీ సమయంలో ఇవి ఉపయోగపడతాయి. అలాగే మీకు ఏమైనా జరిగితే మీ కుటుంబ సభ్యులకు ఆ వివరాల ద్వారా తెలియజేయవచ్చు. ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్వెటర్లు, సాక్స్‌లు, చేతికి గ్లౌజ్‌లు అవన్నీ కూడా మీరు తీసుకెళ్లాలి. అలాగే చలి తీవ్రతను తట్టుకునే దుప్పట్లను తీసుకెళ్లడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.