https://oktelugu.com/

Tech Tips: ఫోన్ ఆన్ లోనే ఉన్నా కూడా మీరు అనుకున్న వాళ్లకు స్విచ్ ఆఫ్ అని వస్తుంది… ఈ సెట్టింగ్ మీ ఫోన్లో ఎలా చేసుకోవాలంటే…

ఈ సెట్టింగ్స్ ను చేయడానికి మీరు వాళ్ళ నెంబరు బ్లాక్ లేదా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీ ఫోన్ను కూడా స్విచ్ ఆఫ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ ఫోన్లో ఇవేమీ చేయకుండానే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని అవతలి వ్యక్తికి వస్తుంది.

Written By:
  • Mahi
  • , Updated On : January 4, 2025 / 01:57 PM IST

    Tech Tips

    Follow us on

    Tech Tips: ప్రస్తుతం వస్తున్న ఫోన్లలో అనేక రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. మీరు ఏదైనా ఒక పనిలో బిజీగా ఉన్న సమయంలో ఫోన్ కాల్ మాట్లాడడం కష్టమవుతుంది. అలాగే కొంతమంది తరచుగా కాల్స్ చేస్తూ విసిగిస్తుంటారు. అలాంటి సమయంలో మీరు తరచుగా ఫోన్ చేసి విసిగించే వాళ్ళని వదిలించుకోవడానికి మీ ఫోన్లో ఈ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ ను చేయడానికి మీరు వాళ్ళ నెంబరు బ్లాక్ లేదా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీ ఫోన్ను కూడా స్విచ్ ఆఫ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ ఫోన్లో ఇవేమీ చేయకుండానే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని అవతలి వ్యక్తికి వస్తుంది. ఇందులో ఒక అడ్వాంటేజ్ విషయం ఏంటంటే మీ ఫోను ఆన్ లోనే ఉంటుంది మరియు మీరు ఆ సమయంలో మీ ఫోన్లో ఏదైనా పనిలో కూడా ఉండొచ్చు. ఇలా సప్లిమెంటరీ ఆప్షన్ కి వెళ్ళిన తర్వాత కాల్ వెయిటింగ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పటికే చాలా పరికరాలలో కాల్ వెయిటింగ్ ఆప్షన్ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకవేళ మీ ఫోన్లో కాల్ వెయిటింగ్ ఆప్షన్ ఉన్నట్లయితే వెంటనే దానిని నిలిపివేయండి. ఆ తర్వాత మీ ఫోన్లో నుంచి కాల్ ఫార్వాడింగ్ ఆప్షన్ కు వెళ్ళండి. ఇలా కాల్ ఫార్వాడింగ్ ఆప్షన్ కు వెళ్లిన తర్వాత మీకు రెండు ఎంపికలు ఉంటాయి. వాయిస్ కాల్స్ మరియు వీడియో కాల్స్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో మీరు వాయిస్ కాల్స్ ఆప్షన్స్ ఎంపిక చేసుకోండి.

    ఇలా వాయిస్ కాల్స్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు నాలుగు ఎంపికలు ఉంటాయి. దీనిలో ఫార్వర్డ్ వెన్ బిజీ ఆప్షన్ ఉంటుంది. మీరు కాల్ ను ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నా నెంబర్ ను నమోదు చేయండి. దీనిలో మీరు ఎక్కువగా స్విచ్ ఆఫ్ చేయబడిన నెంబర్ను మాత్రమే నమోదు చేయాలి. ఇప్పుడు అనేబుల్ ఆప్షన్ క్లిక్ చేయండి. అంతే, ఆ తర్వాత ఎవరైనా కాల్ చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఈ యాప్ ఫోన్లో కాలర్ పేరును చెప్తుంది. ఫోన్ వచ్చినప్పుడు అల్లా మీ ఫోన్ కాలర్ పేరు చెప్పాలంటే ఈ సెట్టింగ్స్ మీ ఫోన్లో చేసుకోండి. ఐఫోన్ యూజర్లకు మీ ఫోన్లో ఈ సదుపాయం ఉంటుంది.

    అయితే ఆండ్రాయిడ్ ఫోన్లను వాడేవారు ట్రూ కాలర్ సహాయం తీసుకుని ఈ సదుపాయం పొందవచ్చు. కాలర్ని తెరిచి చివరలో ఉన్న మూడు చుక్కలను చూసి సెట్టింగ్ లో ఎంపికకు వెళ్ళండి. కాల్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి, కిందకు స్క్రోల్ చేస్తే అనౌన్స్ కాల్స్ ఫీచర్ అని ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన కాలు వచ్చిన ప్రతిసారి మీ ఫోన్ ఆ కాలర్ పేరును చెప్తుంది.