Visa Free Entry : ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి వెళ్లాలని అనుకున్న తప్పకుండా ఆ దేశం అనుమతి కావాలి. ఆ దేశం ఇచ్చే అనుమతి పత్రాన్నే వీసా అంటాం. కొత్త ప్రదేశాలను అన్వేషించాలనుకునే వారికి ఓ గుడ్ న్యూస్. ఈ దేశాల్లో పర్యటించాలనుకుంటే అందుకు వీసా అవసరం లేదు. తరచుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.. అయినా వస్తుందన్న గ్యారంటీ ఉండదు. దీంతో విదేశీ ప్రయాణ కల నెరవేరకుండా అలాగే ఉండిపోతుంది, కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీసా అవసరం లేని ప్రపంచంలోని ఆ దేశాల గురించి ఈ కథనంలో చూద్దాం. భారతీయ పౌరులు వీసా రహిత ప్రవేశాన్ని పొందుతున్న దేశాల జాబితా గురించి తెలుసుకుందాం. అందులో థాయ్ లాండ్, మలేషియా, మారిషస్, జమైకా, మాల్దీవ్స్, కెన్యా, మకావు, బార్బడోస్, కజకిస్థాన్, గాంబియా, నేపాల్, ఎల్ సాల్వడార్, భూటాన్, హైతి, సీషెల్స్, సినెగల్, గ్రెనడా, అంగోలా, డొమినికా, మోంటె రాబ్, సెయింట్ కిట్స్ & నెవిస్, మైక్రోనేషియా, ట్రినిడాడ్ & టొబాగో ఉన్నాయి.
థాయిలాండ్: 30 రోజులు
ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ పౌరులు వీసా అవసరం లేని 26 దేశాలను సందర్శించే అవకాశం ఉంది. ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు దాని అందమైన బీచ్‌లు, నైట్ లైఫ్ రుచికరమైన ఆహారం కోసం థాయిలాండ్‌కు వెళ్లడానికి ఇష్టపడతారు. భారతీయులు 30 రోజుల పాటు వీసా లేకుండా ప్రయాణించవచ్చు . థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, పట్టాయాలో అందమైన జ్ఞాపకాలను సృష్టించుకోవచ్చు.
భూటాన్: 14 రోజులు
భూటాన్ భారతదేశం పక్కనే ఉంది. భారతీయులకు దిబెస్ట్ హాలీడే స్పాట్ లలో ఒకటి. ఇది అద్భుతమైన అడవులు, దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన హిమాలయ దేశం. వీసా లేకుండా 14 రోజుల వరకు భూటాన్‌లో ఉండేందుకు భారతీయులకు అనుమతి ఉంది. కాబట్టి మీరు దేని కోసం ఎదురుచూస్తున్నారు, మీరు మీ తదుపరి సెలవును పొందినప్పుడు, మీ పాస్‌పోర్ట్‌పై విదేశీ స్టాంప్ పొందండి.
నేపాల్: ఏడాది పాటు
భారతదేశం పొరుగు దేశం నేపాల్ అందమైన, ప్రశాంతమైన దేశం. చాలా మంది భారతీయ పర్యాటకులు ఇక్కడ సందర్శించడానికి వెళతారు. పచ్చని అడవులు, నలువైపులా పర్వతాలతో చుట్టుముట్టబడిన దేశం ఇది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ పర్వతం ఇక్కడే ఉంది. దీనితో పాటు ఇక్కడ అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ సందర్శించాలనుకుంటే వీసా అవసరం లేదు.
మారిషస్ – 90 రోజులు
మారిషస్ హిందూ మహాసముద్రంలోని ఒక ద్వీప దేశం, ఇది అందమైన బీచ్‌లు, సరస్సులకు ప్రసిద్ధి చెందింది. భారతీయులు సెలవులు, విశ్రాంతి కోసం ఇక్కడికి రావడానికి ఇష్టపడతారు. భారతీయులు 90 రోజుల పాటు వీసా లేకుండా ఇక్కడ ఉండడానికి అనుమతించింది.
మలేషియా: 30 రోజులు
మలేషియా చాలా అందమైన దేశం, ఇది ఆధునికతతో పురాతన ఆచారాలు, సంప్రదాయాల సమ్మేళనం. ఇక్కడ సందర్శించడానికి అనేక అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, చైనీస్, ఇండియన్, థాయ్, ఇండోనేషియన్ సహా అన్ని రకాల ఆహారాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి మలేషియాకు వచ్చే భారతీయులందరూ వీసా లేకుండా 30 రోజులు ఉండడానికి అనుమతి ఉంటుంది. ఈ దేశాలే కాకుండా, ఇతర దేశాలు కూడా వీసా లేకుండా భారతీయులకు ప్రవేశం కల్పిస్తున్నాయి, అవి క్రింది విధంగా ఉన్నాయి:-
కెన్యా: 90 రోజులు, అంగోలా: 30 రోజులు, బార్బడోస్: 90 రోజులు, డొమినికా: 180 రోజులు, ఎల్ సాల్వడార్: 180 180 రోజులు, ట్రినిడాడ్ మరియు టొబాగో: 90 రోజులు, గ్రెనడా: 90 రోజుల వీసా ఉచితం, గాంబియా: 90 రోజుల వీసా ఉచితం, హైతీ: 90 రోజుల వీసా ఉచితం, జమైకా: వీసా-రహిత ప్రవేశం, కజకిస్తాన్: 14 రోజుల వీసా ఉచితం, మకావు: 30 రోజుల వీసా ఉచితం, సెనెగల్: 90 రోజుల వీసా ఉచితం, వనాటు: 30 రోజుల వీసా ఉచితం.. ఇలా కొన్ని దేశాలు కొద్ది రోజులు వీసా లేకుండా తమ దేశాల్లో పర్యటించేందుకు అనుమతిస్తాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు.. తమ దేశం పర్యాటక రంగాన్ని పెంచుకునే ఆలోచనలో ఈ దేశాలు ఇలా వీసా రహిత ప్రవేశాన్ని అనుమతిస్తాయి.