https://oktelugu.com/

Maha kumbh Mela 2025: పవిత్ర స్నానం ఆచరించారా.. ఈ వస్తువులు దానం చేయడం మరిచిపోవద్దు

వివిధ దేశాల నుంచి కూడా ఈ కుంభమేళాలో పవిత్ర స్నానం చేయడానికి భక్తులు (Maha kumbh Mela) వెళ్తుంటారు. అయితే ఈ కుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన తర్వాత కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా కొన్నింటిని దానం చేయాలని పండితులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 14, 2025 / 07:05 PM IST
    Follow us on

    Maha kumbh Mela 2025: ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటైన మహా కుంభమేళా (Maha kumbh Mela) ప్రారంభం అయ్యింది. ఫిబ్రవరి 26 వరకు ఈ మహా కుంభమేళా జరగనుంది. దీన్ని ఘనంగా ఉత్తర ప్రదేశ్‌లోని (Uttar Pradesh) ప్రయాగ్ రాజ్‌లో (Prayagraj) నిర్వహిస్తున్నారు. ఈ మహా కుంభమేళాకి లక్షలాది భక్తులు వెళ్తుంటారు. పవిత్ర నదులు అయిన గంగా, యమునా, సరస్వతి మూడు నదుల సంగమంలో స్నానం చేయడానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. మొత్తం నాలుగు ప్రదేశాల్లో ఈ మహా కుంభమేళా (Maha kumbh Mela) జరుగుతుంది. అలహాబాద్ ప్రయాగ్‌రాజ్ (Prayagraj), హరిద్వార్ (Haridwar), ఉజ్జయిని (Ujjayini), నాసిక్‌లో(Nasik) జరుగుతుంది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ఈ మహా కుంభమేళాను 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. వివిధ దేశాల నుంచి కూడా ఈ కుంభమేళాలో పవిత్ర స్నానం చేయడానికి భక్తులు (Maha kumbh Mela) వెళ్తుంటారు. అయితే ఈ కుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన తర్వాత కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా కొన్నింటిని దానం చేయాలని పండితులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

    ఆహార దానం
    అన్ని దానాల కంటే అన్నదానం చాలా ముఖ్యమైనది. మహా కుంభమేళాలో స్నానం చేసిన తర్వాత తప్పకుండా అన్నదానం చేయండి. మీరు ఇతరులకు దానం చేయడం వల్ల వారు సంతృప్తి పొందడంతో పాటు మీ పూర్వీకుల ఆత్మలకు మోక్షం లభిస్తుందని పండితులు అంటున్నారు.

    దుస్తులు దానం
    మహా కుంభమేళాలో స్నానం చేసిన తర్వాత మీరు ఇతరులకు బట్టలు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు ప్రయోజనాలు అందుతాయని పండితులు చెబుతున్నారు.

    గంగా జలం దానం
    మహా కుంభమేళాలో స్నానం చేసిన తర్వాత ఆ జలాన్ని ఇంటికి తీసుకురావాలి. వాటిని ఇంట్లోనే ఉంచకుండా ఇతరులకు పంచాలి. ఇలా పంచడం వల్ల కష్టాలు అన్ని తొలగిపోయి మోక్షం లభిస్తుందని పండితులు అంటున్నారు.

    డబ్బులు విరాళం
    మీ స్తోమతను బట్టి డబ్బులు కూడా విరాళం ఇవ్వచ్చు. ఒక అనాథా శ్రమానికి లేదా వృద్ధాశ్రమానికి అయిన కూడా డబ్బులు విరాళంగా ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు అంటున్నారు.

    నువ్వులు, బెల్లం
    మహా కుంభమేళాలో స్నానం తర్వాత నువ్వులు, బెల్లం దానం చేయాలని పండితులు చెబుతున్నారు. ఇలా దానం చేస్తే కెరీర్ విషయంలో మీరు అనుకున్న పనులు అన్ని కూడా జరుగుతాయని పండితులు చెబుతున్నారు.

    ఆవు, ధాన్యం
    ఈ కుంభమేళాలో స్నానం చేసిన తర్వాత ఆవు లేదా ధాన్యం దానం చేయాలని పండితులు అంటున్నారు. ఇలా దానం చేయడం వల్ల మీకు ఉన్న కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి. ఇంట్లో సంతోషం, శాంతి ఉంటాయని నమ్ముతారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.