Sabarimala: మకర సంక్రాంతి పండుగను హిందువులు ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన రోజును మకర సంక్రాంతి (Makar Sankranti) పండుగను జరుపుకుంటారు. అయితే ఈ మకర సంక్రాంతి పండుగ రోజు శబరిమలలో (Sabarimala) మకర జ్యోతి వెలిగిస్తారు. ఈ జ్యోతిని చూడటానికి భక్తులు భారీ సంఖ్యలో వెళ్తారు. మకర జ్యోతి కోసం అయ్యప్ప భక్తులు (Ayyappa Bhakthulu) శబరిమల చేరుకుంటారు. భక్తులు ఎంతగానో ఎదురు చూసే మకర జ్యోతిని దర్శించుకున్నారు. ఆకాశంలో మకర జ్యోతిని (Makara Jyothi) చూసిన వెంటనే అయ్యప్ప మాలను విరమిస్తారు. ఈ మకర జ్యోతి కోసం చాలా మంది వేచి చూస్తారు. అయితే ఈ మకర జ్యోతి అనేది అంత పవిత్రమైనదా? దీనిని చూడటం కోసం ఎందుకు భక్తులు భారీ సంఖ్యలో వెళ్తుంటారు? ఈ జ్యోతి విశిష్టతలు ఏంటో మరి మనం ఈ రోజు స్టోరీలో తెలుసుకుందాం.
మకర జ్యోతి అనే సంప్రదాయం ఇప్పటిది కాదు.. ఎప్పటి నుంచో ఉంది. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన రోజును మకర సంక్రాంతి అంటారు. ఈ రోజున కేరళలో మకరవిళక్కు ఉత్సవాలు నిర్వహిస్తారు. వీటిని పొన్నం బలమేడు అడవిలోని మలయమాన్ కారి వారసులు పిలిచే మలయరామ తెగ వాళ్లు ఆచరిస్తారు. ఇలా అప్పటి నుంచి ఈ మకర జ్యోతిని వెలిగిస్తారు. ఈ మకర జ్యోతిని దర్శించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ మకర జ్యోతి అనేది సుబ్రహ్మణ్యుడు స్వరూపమని భావిస్తారు. జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనం ఇస్తారని భక్తులు నమ్ముతారు. ఈ మకర జ్యోతిని దర్శించుకున్న వారికి మరో జన్మ కూడా అవసరం లేదట. నేరుగా భగవంతుని దగ్గరికి చేరుకుంటారని నమ్ముతారు. ఈ మకర జ్యోతిని దర్శించుకోవడం వల్ల సకల పాపాలు కూడా తొలగిపోతాయని చాలా మంది నమ్మకం. అందుకే తప్పకుండా ఈ మకర జ్యోతిని దర్శించుకోవడానికి అయ్యప్ప భక్తులు వెళ్తుంటారు.
ఈ మకర జ్యోతి రోజు అయ్యప్పను ఆభరణాలతో అలంకరిస్తారు. ఆ తర్వాత ఊరేగిస్తారు కూడా. అయితే అయ్యప్పకు వేసు బంగారు ఆభరణాలను పందళ వంశస్తులు తయారు చేస్తారు. వీరు ప్రతీ ఏడాది మకర జ్యోతికి మూడు లేదా నాలుగు రోజులు కిందట నడక మార్గంలో ఆభరణాలు పట్టుకుని స్టార్ట్ అయ్యి.. మకర సంక్రాంతి రోజు సాయంత్రానికి వస్తారు. భక్తులు ఈ మకర జ్యోతిని దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ జ్యోతి కనిపిస్తుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య ఈ జ్యోతి దర్శనం ఉంటుంది. ఈ సమయంలో అందరూ కూడా తప్పకుండా మకర జ్యోతిని దర్శించుకోవాలి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.