spot_img
Homeఆధ్యాత్మికంKushaiguda Hanuman Statue: కుషాయిగూడలో 54 అడుగుల ఆంజనేయుడు విగ్రహం.. విశేషాలు ఏంటంటే...

Kushaiguda Hanuman Statue: కుషాయిగూడలో 54 అడుగుల ఆంజనేయుడు విగ్రహం.. విశేషాలు ఏంటంటే…

Kushaiguda Hanuman Statue: హైదరాబాద్‌లోని కుషాయిగూడ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన 54 అడుగుల భారీ అభయాంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ వేడుకలు భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి. ఈ మహా విగ్రహం భారతదేశంలోనే అతిపెద్దదిగా చెప్పుకుంటున్నారు. శ్రీరామ చరిత్రలో అభయం ప్రదర్శిస్తున్న అంజన్న రూపంలో ఈ విగ్రహాన్ని చూసేందుకు భక్తులు తరలివచ్చారు. స్థానిక భక్తులు, దాతల సహకారంతో రూపొందించిన ఈ విగ్రహం విశేషాల గురించి వివరాల్లోకి వెళితే..

కుషాయిగూడలో 54 అడుగుల భారీ అభయాంజనేయ స్వామి విగ్రహం శ్రీరాముడిని కాపాడిన అభయకరం రూపంలో దర్శనమిస్తుంది. సుమారు 16.5 మీటర్ల ఎత్తు ఉన్నాయి విగ్రహాన్ని 18 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేశారు. స్థానిక భక్త సంఘాలు, దాతలు, శ్రీరామ్ ట్రస్ట్ సహకారంతో రూ. 15 కోట్ల ఖర్చుతో ఈ మహా కార్యం సాకారమైంది. విగ్రహం ప్రత్యేకంగా తయారైన ఫైబర్ రెసిన్ మెటీరియల్‌తో నిర్మించారు. దీంతో భవిష్యత్తులో వర్షాలు, ఇతర ప్రకృతి విపత్తులు వచ్చినా.. తట్టుకునే శక్తి ఉంటుంది.

విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం భాగంగా శనివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైంది. ఇందులో భాగంగా ముందుగా లేజర్ లైటింగ్, ఫైర్‌వర్క్స్‌ భక్తులు ఉత్సాహంగా గడిపారు. ఈ ప్రాంతంలో. రంగురంగుల దీపాలతో అలంకరించడంతో ఆంజనేయ స్వామివారు విద్యుత్ దీపాల మధ్య మెరిసిపోయినట్లు కనిపించారు. భక్తులంతా కలిసి ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేయడం వల్ల ఈ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

వేడుకల్లో స్థానిక నాయకులు, ఆధ్యాత్మిక కార్యకర్తలు పాల్గొన్నారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రసాద వితరణ, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూస్తే గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా త్వరలో హనుమాన్ జయంతి కూడా రాబోతుండడంతో చాలామంది హనుమాన్ దీక్ష పరులు ఇక్కడికి వచ్చి భజనలతో సందడి చేశారు. ఒకసారిగా ఈ ప్రాంతం మొత్తం కాషాయమయంగా మారిపోయింది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper
Exit mobile version