Kumba Mela 2025: ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవాల్లో కుంభమేళా ఒకటి. వచ్చే ఏడాది దీన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ కుంభమేళాను నిర్వహించనున్నారు. ఈ కుంభమేళానికి లక్షలాది భక్తులు వెళ్తుంటారు. పవిత్ర నదులు అయిన గంగా, యమునా, సరస్వతి మూడు నదుల సంగమంలో స్నానం చేయడానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. అయితే ఈ కుంభమేళా మొత్తం నాలుగు ప్రదేశాల్లో జరుగుతుంది. అలహాబాద్ ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లో జరుగుతుంది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ఈ మహా కుంభమేళాను 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. అయితే కుంభమేళా అంటే కేవలం ఒక రకం మాత్రమే ఉందని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ కుంభమేళాలో మొత్తం నాలుగు రకాలు ఉన్నాయట. వీటిని కొన్నిళ్లకు ఒకసారి ఆ నాలుగు ప్రాంతాల ప్రజలు జరుపుకుంటారు. మరి కుంభమేళాలో ఉండే ఆ నాలుగు రకాలు ఏంటో మీకు తెలియాలంటే.. మీరు మా స్టోరీ చదివి తీరాల్సిందే.
పూర్ణ కుంభమేళా
ఈ మహా కుంభమేళా గురించి అందరికీ తెలిసిందే. దీన్ని 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ఈ కుంభమేళాను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ సమయంలో గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమంలో పుణ్యస్నానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకేనేమో ఈ పూర్ణ కుంభమేళాకు ఎక్కువగా భక్తులు వెళ్తుంటారు. అసలు ఖాళీ లేకుండా ఎక్కువగా వెళ్తుంటారు.
అర్ధ కుంభమేళా
ఈ అర్ధ కుంభమేళాను ఆరేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. హరిద్వార్, ప్రయాగ్‌రాజ్‌లలో జరిగే కుంభమేళం. దీనికి కూడా భక్తులు భారీ సంఖ్యలో వెళ్తుంటారు. ఈ అర్ధ కుంభమేళంలో కూడా భక్తులు స్నానాలు చేయడానికి వెళ్తుంటారు. ఈ కుంభమేళాలో కూడా స్నానం చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. 12 ఏళ్లకు జరిగే మహా కుంభమేళాకు ఎంత పవిత్రమైనదో ఆరేళ్లకు జరిగే ఈ అర్థ కుంభమేళా కూడా అంతే పవిత్రమైనదని పండితులు అంటున్నారు.
కుంభమేళా
మూడేళ్లకు జరుపుకునే దానికి కుంభమేళా అంటారు. ఈ కుంభమేళాను హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్‌రాజ్‌లో మూడేళ్లకు ఒకసారి జరుపుకుంటారు. మహా కుంభమేళా, అర్ధ కుంభమేళాతో పోల్చుకుంటే ఈ కుంభమేళాను చాలా చిన్నగా చేసుకుంటారు. కానీ భక్తులు మాత్రం లక్షల్లో వెళ్తుంటారు. ఎలాంటి పాపాలు అయిన కూడ ఈ కుంభమేళాలో తొలగిపోతాయని భక్తులు ఎక్కువగా నమ్ముతారు.
మాఘ మేళా
ఈ మహా కుంభం ప్రతీ ఏడాది నిర్వహిస్తారు. ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమం వద్ద నిర్వహిస్తారు. దీనికి చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే భక్తులు వస్తుంటారు. అన్నింటి కంటే పూర్ణ కుంభమేళాకే భక్తులు ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. అక్కడ పుణ్య స్నానం చేయడం వల్ల పాపాలు అన్ని తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు, సలహాల కోసం పండితులను సంప్రదించగలరు.