https://oktelugu.com/

Fruits : బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడంలో సహాయపడే శీతాకాలపు పండ్లు

చలికాలం వచ్చిందంటే చాలు చాలా పండ్లు పండుతాయి. ఈ పండ్లలో చాలా పోషకాలు ఉంటాయి. మీకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి ఈ ఫ్రూట్స్.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 15, 2024 / 03:00 AM IST

    Fruits

    Follow us on

    Fruits : చలికాలం వచ్చిందంటే చాలు చాలా పండ్లు పండుతాయి. ఈ పండ్లలో చాలా పోషకాలు ఉంటాయి. మీకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి ఈ ఫ్రూట్స్. పండ్లు అనగానే తినడం గుర్తుకు వస్తుంది. తింటే పొట్ట వస్తుంది. ఎక్కువ తినడం వల్ల ఫ్యాట్ పెరుగుతుంది. అందుకే కొన్ని ఆహారాలు తినాలి అంటే ఆలోచించాలి. ఇక బెల్లీ ఫ్యాట్ వచ్చిందంటే బాస్ వదిలించుకోవడం మరింత కష్టం. ఇప్పుడు మనం కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం. వాటి వల్ల బెల్లీ ఫ్యాట్ రాదు కానీ ఉన్న ఫ్యాట్ పోతుంది. ఇంతకీ ఆ ఫుడ్ ఏంటి అనుకుంటున్నారా? ఫుడ్ కాదు ఫ్రూట్స్ అండోయ్. అయితే ఈ శీతాకాలంలో పండే పండ్లతో బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. మరి ఆ పండ్లు ఏంటి? వాటితో ఎలా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందో ఓ సారి తెలుసుకుందాం. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, పండ్లను తినడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలంలో నీటి బరువు, ఉబ్బరం వంటి సమస్యలకు కూడా దూరంగా ఉండవచ్చు. శీతాకాలం లో ఇంటి వద్దే ఈ పండ్లు పండుతాయి కూడా. మరి శీతాకాలపు ఆ ఉత్తమ పండ్లు ఏంటో చూసేద్దాం.

    దానిమ్మలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దానిమ్మను జ్యూస్ చేసుకొని తాగిన సరే బాగుంటుంది కదా. కానీ ఈ దానిమ్మను ఒలుచుకొని తినడం చాలా మందికి బద్దకం. కానీ ఒలుచుకొని తింటే మాత్రం చాలా ప్రయోజనాలు ఉంటాయి బాస్ తక్కువ కేలరీల కౌంట్, కొవ్వును కాల్చడంలో సహాయపడే పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్ల ఇందులో ఉంటాయి. ఈ లక్షణాలు ఉండటంతో పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది దానిమ్మ. ఇక యాపిల్స్‌లో ఫైబర్, నీరు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీకు ఎక్కువసేపు నిండుగా అనిపించేలా చేస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయని కూడా చెప్పవచ్చు. అధిక ఫైబర్ కంటెంట్, తక్కువ కేలరీల కౌంట్, సంతృప్తిని ప్రోత్సహించే సామర్థ్యంతో ఉంటుంది జామ. ఇది పొట్ట కొవ్వును తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీరు తక్కువ తినడానికి, బరువు తగ్గడంలో సమర్థవంతంగా సహాయపడుతుంది.

    ఆరెంజ్‌లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. సున్నా కొవ్వును కలిగి ఉంటుంది. ఇది మిమ్మల్ని సంతృప్తికరంగా ఉంచుతుంది. ఇతర అనారోగ్యకరమైన ఆహారాలు, పండ్ల నుంచి దూరంగా ఉంచడానికి ఉత్తమమైన శీతాకాలపు పండ్లలో ఒకటిగా ఉంటుంది. అంజీర్ ను అంజీరా అని కూడా అంటారు. అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా బరువు తగ్గడానికి, బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. సపోటా ను ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా? దాన్ని ఒలుచుకొని తినడం కష్టం కానీ తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటది కదా. సూపర్ గా అనిపిస్తుంది. తిన్న కొద్ది తినాలి అనిపిస్తుంది. అయితే ఈ ఫ్రూట్ కూడా బొడ్డు కొవ్వు, అదనపు బరువును తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఈ ఫ్రూట్ లో ఉండే డైటరీ ఫైబర్‌లు ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండే అనుభూతిని కలిగిస్తాయి

    నల్ల ద్రాక్షలో అధిక మోతాదులో రెస్వెరాట్రాల్ ఉంటుంది. ఇది శరీరంలో ఊబకాయాన్ని ప్రేరేపించే కొవ్వుల కంటే మంచి కొవ్వులను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. బొప్పాయిలో పాపైన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడే ఒక ఎంజైమ్. ఇది ఉబ్బరం తగ్గిస్తుంది.