సంపదకు అధిపతి అయిన కుభేరుడి ఆశీస్సులు ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కొందరు జీవితంలో ఎంత సంపాదించినా డబ్బు నిలవదు.. మరికొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆదాయం లభించదు. ఈ క్రమంలో తమ ఆదాయం పెంపుదల కోసం కుభేరుడిని పూజిస్తే సకల సంపదలు పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అయితే కేభేరుడికి ఇష్టమైన రాశులు కొన్ని ఉన్నాయి. ఈ రాశుల్లో కుభేరుడు సంచరించినట్లయితే ఆ రాశుల వారి జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇంతకీ కుభేరుడికి ఇష్టమైన ఆ రాశులేవో ఒకసారి చూద్దాం..
శుక్రుడిని సంపద సృష్టి గ్రహంగా పిలుస్తారు. శుక్రుడు వృషభ రాశికి అధిపతిగా ఉంటాడు. ఇదే సమయంలో కుభేరుడు సైతం వృషభ రాశిపై ఆశీస్సులను కురిపిస్తాడు. వృషభరాశి అంటే కుభేరుడికి బాగా ఇష్టం. దీంతో కుభేరుడి దయ వల్ల ఈ రాశి కలిగిన వారికి ఆదాయం పెరుగుతుంది. వీరు ఏ పని చేపట్టినా సక్సెస్ సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెండింగులో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటారు.
కుభేరుడికి కర్కాటక రాశి అంటే ఇష్టం. ఈ రాశికి చెందిన వారిపై కుభేరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ రాశి వారు ఎలాంటి కష్టం చేసినా అవి సత్ఫలితాలు ఇస్తాయి. లక్ష్యాలను ఏర్పరుచుకున్న వారు తొందరగా వాటి గమ్యం చేరుకుంటారు. డబ్బు సంపదించడానికి అవకాశం దొరుకుతుంది. ప్రతిభ ద్వారా జీవితంలో అన్ని విజయాలు సాధిస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తారు.
బృహస్పతి ఆధీనంలో ఉండే ధనస్సు రాశిపై కుభేరుడి మనసు ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడూ దైవ పూజల్లో మునిగిపోతారు. దీంతో కుభేరుడి ఆశీస్సులు పొందుతారు. వీరి పూజలకు ఫలితంగా వారు సంతోషంగా ఉండేలా కుభేరుడు దీవిస్తాడు. ఈ రాశి వారికి అనుకోకుండానే ఆదాయం సమకూరుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది.