https://oktelugu.com/

Karthika Pournami 2024: కార్తీక పౌర్ణమి: 365 వత్తులు వెలిగించడంపై చాగంటి వీడియో వైరల్..

పరమ పవిత్రమైన కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వల్ల జీవితంలో ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈరోజు సూర్యోదయానికి ముందే కుదిరితే నదీస్నానం చేసి ఆ తరువాత సమీపంలోని నదీస్నానం చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలగనున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 15, 2024 / 09:26 AM IST

    Karthika Pournami 2024

    Follow us on

    Karthika Pournami 2024: తెలుగు పంచాంగం ప్రకారం ప్రతీ నెలలో ఒక పౌర్ణమి వస్తుంది. కానీ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఉంది. ఈరోజు దేవతలంగా భూమిపైకి వస్తారని, ఈరోజు దేవతలను వివిధ పద్ధతుల ద్వారా ఆరాధించడం వల్ల వారి అనుగ్రహం పొందవచ్చని భక్తుల నమ్మకం. అందుకే కార్తీక పౌర్ణమి రోజున పూజలు నిర్వహించేందుకు భక్తులు సిద్ధమవుతారు. దీపావళి తరువాత వచ్చే కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులను వెలిగించడం వల్ల ఏడాదంతా మంచే జరుగుతుందని అంటారు. అయితే ఈ వత్తులను ఎవరు వెలిగించాలి? అనే విషయంపై చాలా మందికి సందేహం ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వర్ రావు దీనిపై చెప్పిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ చాగండీ ఈ వత్తుల విషయంలో ఏం చెప్పాడు? ఈ వీడియో ఎలా ఉంది?

    పరమ పవిత్రమైన కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వల్ల జీవితంలో ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈరోజు సూర్యోదయానికి ముందే కుదిరితే నదీస్నానం చేసి ఆ తరువాత సమీపంలోని నదీస్నానం చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలగనున్నాయి. కార్తీక పౌర్ణమి రోజున నదుల వద్ద దేవతలు సంచరిస్తారట. అందువల్ల నదుల్లో స్నానం చేసిన తరువాత ఇందులో దీపాలు వదలడం ద్వారా వారి అనుగ్రహం పొందవచ్చని చెబుతారు. ఆ తరువాత సమీపంలోని ఆలయాల్లో వత్తులు వెలిగించాలని పండితులు చెబుతున్నారు.

    అయితే ఈరోజు 365 వత్తులను వెలిగించాలని ప్రముఖ పండితుడు చాగంటి కోటేశ్వర్ రావు ఓ వీడియోలో చెప్పాడు. ఆలయాంలో కార్తీక పౌర్ణమి రోజున వత్తులను వెలిగించడం వల్ల జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే చాలా మంది అవగాహన లేకుండా 365 వత్తులను కేవలం మహిళలు మాత్రమే వెలిగిస్తారు. కానీ ఈ వత్తులను భర్తతో కలిసి వెలిగించాలని అంటున్నారు.కుటుంబ పెద్ద పంచె కట్టుకొని తన భార్యతో కలిసి దేవాలయానికి వెళ్లి 365 వత్తులను వెలిగించాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆ కటుంబం మొత్తానికి దైవానుగ్రహం ఉంటుందని అంటున్నారు.

    కటుంబ పెద్ద ఆలయాల్లో వత్తులు వెలిగించే సమయంలో కొన్ని మంత్రాలను జపించడం వల్ల వాటికి ఫలాతాలు ఉంటాయి. కార్తీక పౌర్ణమి రోజు దేవాలయంల దీపం పెట్టే సమయంలో ‘ కీటా: పతంగా: మశకాశ్చ వృక్షా: జలే స్థలే యే నివసంతి జీవా: దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగిన : భవంతి త్వం శృపచాహి విప్రా: అనే మంత్రం చదవాలి. ఆలయాలకు వెళ్లడానికి సాధ్యం కానివారు ఇంట్లో తులసి చెట్టు వద్ద మహా విష్ణువు చిత్రాన్ని ఉంచి దీపం పెట్టవచ్చని అంటున్నారు. కార్తీక మాసం శివకేశవులకు ఇష్టమైనది. అయితే కార్తీక పౌర్ణమి రోజున మహా విష్ణువును ఆరాధించడం వల్ల జీవితంలో అన్నీ శుభాలే ఉండనున్నాయి అలాగే ఈరోజు నదీ స్నానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు మానసికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటారు.