https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : రేటింగ్స్ కోసం బిగ్ బాస్ టీం చీప్ ట్రిక్స్.. తేజ ని మానసికంగా టార్చర్ చేస్తున్నారుగా!

ఈ సీజన్ లో బిగ్ బాస్ టీం రేటింగ్స్ కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. చూసే ఆడియన్స్ కి కూడా అలాగే అనిపిస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : November 15, 2024 / 09:17 AM IST

    Bigg Boss team cheap tricks for ratings.. Teja is being tortured mentally!

    Follow us on

    Bigg Boss Telugu 8 :  ఈ సీజన్ లో బిగ్ బాస్ టీం రేటింగ్స్ కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. చూసే ఆడియన్స్ కి కూడా అలాగే అనిపిస్తుంది. ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు, వాళ్లకి ఏది నిజాయితీగా జరుగుతుంది, ఏది ఫేక్ గా నడుస్తుంది అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. వాళ్ళని మెప్పించడం అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. ఈ వారం టేస్టీ తేజ విషయం లో బిగ్ బాస్ టీం నాగార్జున తో చేయించిన చీప్ ట్రిక్స్ చూస్తే ఆడియన్స్ కి చాలా చిరాకు రప్పించింది. గత వీకెండ్ లో హౌస్ మేట్స్ అందరిని లోపలకు పిలిచి ‘వరస్ట్ కంటెస్టెంట్’ ఎవరు అని అడగగా, అత్యధిక శాతం మంది టేస్టీ తేజ కి ఓట్లు వేశారు. దీంతో వరస్ట్ కంటెస్టెంట్ గా ఎంపిక కాబడిన తేజకి ఫ్యామిలీ వీకెండ్ లో అతని కోసం ఎవ్వరూ రావడం లేదని నాగార్జున చెప్తాడు. తేజ ఈ సీజన్ లోకి అడుగుపెట్టింది తన తల్లిని బిగ్ బాస్ షోకి రప్పించడం కోసం.

    ఈ లక్ష్యంతోనే అడుగుపెట్టానని ఆయన నాగార్జున తో ఎన్నోసార్లు చెప్పాడు కూడా. సరిగ్గా ఆ పాయింట్ ని పట్టుకొని బిగ్ బాస్ అతనితో చీప్ గేమ్ ఆడడం అసలు ఏమాత్రం బాగాలేదని అనిపించింది. ఈ వారం మొత్తం తేజ మానసికంగా చాలా కృంగిపోయాడు. ప్రతీ కంటెస్టెంట్ కి సంబంధించిన కుటుంబం హౌస్ లోకి వచ్చినప్పుడల్లా తేజ మూలకి వెళ్లి ఏడుస్తూ కూర్చున్నాడు. ఇది ఏ మాత్రం ఫేక్ అనిపించలేదు, నిజం అనే అనిపించింది. రోజుకి ముగ్గురు కంటెస్టెంట్స్ సంబంధించిన కుటుంబ సభ్యులు హౌస్ లోపలకు అడుగుపెడుతూ ఉన్నారు. గురువారం వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. శుక్రవారం ఖాళీ కాబట్టి ఆ రోజు మెగా చీఫ్ టాస్క్ పెడుతారు కాబట్టి తేజ కి తన తల్లి వచ్చే అవకాశం లేదని బలంగా నమ్ముతాడు.

    కావాలంటే నేను ఎలిమినేట్ అయ్యే వరకు నామినేట్ చెయ్యండి, సోమవారం వచ్చినప్పుడు నన్ను ఎవరైనా నామినేట్ చేస్తే నేను నా పాయింట్స్ ని కూడా డిఫెండ్ చేసుకోను, మౌనంగా అంగీకరించి నామినేషన్స్ లోకి వెళ్తాను, దయచేసి మా అమ్మని లోపలకు పంపండి బిగ్ బాస్ అని ఏడుస్తాడు తేజ. ఇందులో ఎలాంటి ఫేక్ ఏడుపులు లేవని అందరికీ స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే తేజ ని ఇంత ఏడిపించిన బిగ్ బాస్ చివరికి చేసింది ఏమిటంటే టేస్టీ తేజ తల్లి ని నిన్న రాత్రి బిగ్ బాస్ హౌస్ లోకి పంపారట. నేడు దీనికి సంబంధించిన ప్రోమో రాబోతుంది. ఈ స్క్రిప్ట్ ఆడియన్స్ కి ఆదివారం రోజే అర్థమైంది, టీఆర్ఫీ రేటింగ్స్ కోసం రాజనాల కాలం నాటి ఆలోచనలు బిగ్ బాస్ టీం ఇంకా మానుకోలేదు అంటూ ఈ అంశంపై సోషల్ మీడియా లో ఒక రేంజ్ ట్రోల్ల్స్ నడుస్తున్నాయి.