https://oktelugu.com/

Karthika Pournami 2024: కార్తీక పౌర్ణమీ.. స్నానం.. దీపం.. దానానికి ప్రాధాన్యం

కార్తీక మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజును దేశ వ్యాప్తంగా పండుగలా జరుపుకుంటారు. ఈ రోజుకు హిందూ సంస్కృతి, సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది.

Written By: Raj Shekar, Updated On : November 15, 2024 10:19 am
Karthika Pournami 2024(2)

Karthika Pournami 2024(2)

Follow us on

Karthika Pournami 2024: కార్తీక పౌర్ణమి.. కార్టీక మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి. ఈ రోజును దేశవ్యాప్తంగ పండుగలా జరుపుకుంటారు. హిందు సంస్కృతి, సంప్రదాయంలో కార్తిక పౌర్ణమికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈరోజు నదీ స్నానాలు ఆచరిస్తారు. దీపాలు వెలిగిస్తారు. దానాలు చేస్తారు. కార్తిక పౌర్ణమిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. శుక్రవారం(నవంబర్‌ 15న) కార్తిక పౌర్ణమి నేపథ్యంలో పూజలు, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. కార్తిక పౌర్ణమి రోజు ఆలయాలన్నీ దీప కాంతులతో దేదీప్యమానంగా విరాజిల్లుతాయి. శివనామ స్మరణతో శివాలయాలన్నీ మార్మోగుతాయి. కార్తిక పౌర్ణమి రోజే శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించారట. ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. త్రిపురాసురుడి పీడ తొలగిపోయినందున దేవతలు స్వర్గమంతా దీపాలు వెలిగించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే భూమిపైనా ఈ విజయాన్ని కార్తిక పౌర్ణమి పండుగగా జరుపుకుంటారు. ఈ రోజు ఆలయాలు, నదీ తీరాల్లో దీపాలు వెలిగిస్తారు. దీపాలు వెలిగించి అరటి దొప్పల్లో ఉంచి నదిలో వదిలేస్తారు. దీపాలు దానం చేస్తారు. ఉసిరి దీపాలు వెలిగిస్తారు.

మత్సా్యవతారంలో విష్ణువు..
ఇక కార్తిక పౌర్ణమిని శివ కేశవుల మాసంగా భావిస్తారు. కార్మిక పౌర్ణమిని శిష్ణువు తన మత్స్య అవతారంలో కనిపించడాన్ని సూచిస్తుంది. ఇది సృష్టి సంరక్షణకు సంబంధించిన విశ్వ చక్రంతో ముడిపడి ఉందని విశ్వసిస్తారు. ఈ పౌర్ణమి రోజు పుణ్యకార్యాలు ఆధ్యాత్మిక వృద్ధితోపాటు సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.

పవిత్ర స్నానం, దానం
ఇక కార్తిక పౌర్ణమబి రోజు పవిత్ర నదీ స్థానాలు ఆచరిస్తారు. గంగా, యమున, కృష్ణ, గోదావరి నదుల్లో పవిత్ర స్నానాలు ఆచరిస్తే మోక్షం లభిస్తుందని, సర్వ పాపాల నుంచి విముక్తి లబిస్తుందని భక్తులు నమ్ముతారు. ఇక ఈ రోజు ఆవునేతిలో ఉంచి 365 వత్తులను దేవుడి ముందు వెలిగిస్తే పాపాలను వెలిగింది. పాపాల నుంచి విముక్తి ప్రసాదించమని కోరుకుంటారు. ఈ రోజు 365 వత్తులు వెలిగిస్తే సంవత్సరమతా పూజలు చేయకపోయినా అంతేపుణ్యం లభిస్తుందనినమ్ముతారు. పౌర్ణమి రోజు భక్తితో దీపం వెలిగించి దేవదేవుడికి నమస్కరిస్తే చాలని కార్తిక పురాణం చెబతుంది.

ఉపవాసం..
ఇక కార్తిక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి శివాలయంంలో లేదా వైష్ణవ ఆలయంలో ఆవునేయిలో నానబెట్టిన 365 వత్తులు వెలిగిస్తారు. భక్తితో పూజాదికాలు సమర్పించి ఉపవాసం విరమిస్తారు దేవాలయాలకు, నదీ తీరాలకు వెళ్లలేనివారు ఇంట్లోనే పిండితో ముగ్గులు పెట్టుకుని తులసి వద్ద దీపాలు వెలిగించి నమస్కరిస్తారు.

దానం..
ఇక కార్తిక పౌర్ణమి రోజు చేసే విరాళం అత్యంత ముఖ్యమైనది. అందుకే చాలా మంది పేదలకు, బ్రాహ్మణులకు ఆహారం, దుస్తులు, ఇతర వసుత్వులు దానం చేస్తారు. గరుడ పురాణంతో సహా వివిధ హిందూ గ్రంథాలలో దాతృత్వం గురించిన ప్రాముఖ్యతగా చెప్పబడింది. మరికొందమంది ఈ రోజు కేదార్శీ్వరుడిని నోముకుని అన్నదానం చేస్తారు.