India Vs South Africa 4th T20: టీమిండియా చివరిదైన నాలుగో t20 గెలిస్తే ప్రపంచ రికార్డును సృష్టించుకుంటుంది. దక్షిణాఫ్రికా కంటే టీమిండియా అత్యంత కీలకం. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో ఆడుతున్న భారత జట్టు.. ఈ మ్యాచ్లో గెలిస్తే ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది. ఆరు సంవత్సరాల క్రితం టీమిండియా దక్షిణాఫ్రికా పై టీ20 సిరీస్ గెలిచింది. ఆ తర్వాత ఇంతవరకు మరోసారి ఆ ఘనతను సొంతం చేసుకోలేదు. అయితే ప్రస్తుత సిరీస్ గనక టీమిండియా గెలిస్తే కచ్చితంగా ఆరు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతుంది. భారత జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై ప్రస్తుతం ఆడుతున్న టి20 సిరీస్ ఏడవది. ఇందులో ఒకసారి మాత్రమే టీమిండియా సిరీస్ నష్టపోయింది. అయితే ప్రస్తుత సిరీస్ ను కూడా గెలుచుకుంటామని సూర్యకుమార్ యాదవ్ చెప్తున్నాడు. ఒకవేళ చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికా గనుక విజయం సాధిస్తే సిరీస్ డ్రా అవుతుంది. ఒకవేళ టీమ్ ఇండియా గెలిస్తే 3-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంటుంది. అంతేకాదు భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న టి20 సిరీస్లో ఒక జట్టు మూడు మ్యాచ్లు గెలవడం ఇదే తొలిసారి అవుతుంది. గతంలో ఏ జట్టు కూడా దక్షిణాఫ్రికాపై రెండు మ్యాచ్లకు మించి టి20 లు ఆడలేదు. ఇక దక్షిణాఫ్రికా పై భారత్ గతంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ టి20 మ్యాచ్ల సిరీస్లో పోటీ పడటం ఇది రెండవసారి. 2022లో దక్షిణాఫ్రికా జట్టు భారత్ లో పర్యటించింది. ఐదు మ్యాచ్లో టి20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్ 2-2 తో సమం అయ్యింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఈ నేపథ్యంలో టీమిండియా కు ప్రస్తుతం ఒక భారీ అవకాశం వచ్చింది. 2018లో దక్షిణాఫ్రికాలో జరిగిన టి20 సిరీస్ ను భారత్ సొంతం చేసుకుంది.. ఆ తర్వాత రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్లు జరగగా భారత్ 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది.
వీళ్లు నిరూపించుకోవాలి
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో దక్షిణాఫ్రికా కంటే భారత్ ముందంజలో ఉంది. సంజు శాంసన్ గత రెండు మ్యాచ్లలో 0 పరుగులకే అవుట్ కాగా.. తిలక్ వర్మ సూపర్ సెంచరీ చేసి తన పూర్వపు లయను అందుకున్నాడు. అభిషేక్ శర్మ మూడవ టి20 మ్యాచ్లో ఆఫ్ సెంచరీ చేసి టచ్ లోకి వచ్చాడు. సూర్య కుమార్ యాదవ్, రింకూ సింగ్ వంటి వారు మెరుగైన ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది.. బౌలింగ్ విభాగంలో పెద్దగా వంక పెట్టడానికి లేకపోయినప్పటికీ.. పేస్ బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడం భారత జట్టును కలవరపరుస్తోంది. స్పిన్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అతడు మెలికలు తిప్పే బంతులు వేయడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు చుక్కలు చూస్తున్నారు. చివరిదైన నాలుగో టి20 మ్యాచ్లో అతడు అదే మాయాజాలాన్ని ప్రదర్శిస్తే భారత జట్టుకు తిరుగుండదు.