Tirumala VIP Darshan Issue: తిరుమలలో( Tirumala) తరచూ ఎమ్మెల్యేలు సిబ్బందితో వాగ్వాదం చేయడం పరిపాటిగా మారింది. తాజాగా తిరుపతి జిల్లా వెంకటగిరి టిడిపి ఎమ్మెల్యే కోరుగొండ్ల రామకృష్ణ టీటీడీ సిబ్బందితో గొడవకు దిగారు. ప్రస్తుతం ఇదే హార్ట్ టాపిక్ అవుతోంది. ఆయన నిన్ననే ఉదయం వీఐపీ బ్రేక్ లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం తిరుగు ముఖం పట్టే క్రమంలో.. గేటు వద్ద ఉన్న సిబ్బందితో వాదనకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
Also Read: ఏపీలో ‘పట్టా’లెక్కనున్న మెట్రో!
మహా ద్వారం ఎదురు గేటు వద్ద వివాదం..
ఎమ్మెల్యే రామకృష్ణ( MLA Ramakrishna) కుటుంబ సభ్యులతో పాటు అనుచరులతో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకున్నారు. మహా ద్వారం ఎదురుగా ఉన్న గేటు వద్దకు వచ్చారు. గేటు తీయాలని అడిగారు. అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి ఈ గేటు తీయకూడదు అని ఎమ్మెల్యేతో అన్నారు. ఈ గేటు లో నుంచి ఎవరిని అనుమతించొద్దని ఉన్నతాధికారులు ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. అందరూ వెళ్లి పుష్కరిణి వైపు ఉన్న మార్గంలో బయటకు వెళ్లాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యే రామకృష్ణ లో ఒక్కసారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరోసారి గేటు తీయాలని ఆదేశించిన తీయకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పరిస్థితిని గమనించిన భద్రతా సిబ్బంది అక్కడకు వచ్చి సర్ది చెప్పి ఎమ్మెల్యేను అదే మార్గం గుండా పంపించారు.
గతంలో కూడా ఘటనలు..
గతంలో కూడా ఇటువంటి ఘటనలు తిరుమలలో జరిగాయి. ముఖ్యంగా మహాద్వారం( mahadvaram) దగ్గర గేటు తీసే విషయంలో తరచూ వివాదాలు జరుగుతున్నాయి. బెంగళూరుకు చెందిన టీటీడీ పాలకమండలి సభ్యుడు, టీటీడీ ఉద్యోగి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పట్లో ఈ ఘటన చర్చనీయాంశం అయ్యింది. తాజాగా టిడిపి ఎమ్మెల్యే, టీటీడీ ఉద్యోగి మధ్య వాగ్వాదం జరగడం విశేషం. వాస్తవానికి ఆ మహా ద్వారం ఎదురుగా ఉన్న గేటు నుంచి బయటకు ఎవరిని విడిచి పెట్టవద్దని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. దానిని దిగువ స్థాయి సిబ్బంది పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే గొడవలు జరుగుతున్నాయి. అయితే ఇలా గొడవలు జరుగుతున్న క్రమంలో టీటీడీ అధికారులు సర్ది చెప్పడం పరిపాటిగా మారింది. అధికారుల ఆదేశాలతోనే తాము అలా చేస్తున్నామని.. కానీ ప్రజాప్రతినిధుల ఆగ్రహానికి గురవుతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.